Ravi Teja: రవితేజ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకులెవరో తెలుసా?

మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈగల్ సినిమాతో రవితేజ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రవితేజ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. రవితేజ ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరిచయం చేయగా ఆ దర్శకునికి సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రవితేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకులలో శ్రీనువైట్ల ఒకరు. నీకోసం సినిమాతో శ్రీనువైట్ల ఇండస్ట్రీకి పరిచయమై తొలి సినిమాతోనే మంచి దర్శకునిగా పేరును సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత ఈ అబ్బాయి చాలా మంచోడు అనే సినిమాతో అగస్త్యన్ అనే దర్శకుడిని టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఒకరాజు ఒకరాణి సినిమాతో మాస్ మహారాజ్ యోగి అనే దర్శకుడిని పరిచయం చేయగా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమాతో ఎస్.గోపాల్ రెడ్డిని మాస్ మహారాజ్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం చేశారు.

భద్ర సినిమాతో బోయపాటి, షాక్ సినిమాతో హరీష్ శంకర్, శంభో శివ శంభో సినిమాతో సముద్రఖని, డాన్ శీను సినిమాతో గోపీచంద్ మలినేని, పవర్ సినిమాతో బాబీ, టచ్ చేసి చూడు సినిమాతో విక్రమ్ సిరికొండ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో శరత్ మండవలకు రవితేజ ఛాన్స్ ఇచ్చారు. కథ నచ్చితే జయాపజయాలతో సంబంధం లేకుండా ఛాన్స్ ఇచ్చే విషయంలో రవితేజ ముందువరసలో ఉంటారు.

రవితేజ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకొని రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి. త్వరలో రవితేజ ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. రవితేజ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus