Sita Ramam: ఈ టాలీవుడ్ హీరోలు సీతారామం మూవీకి నో చెప్పారా?

ఈ నెల 5వ తేదీన థియేటర్లలో విడుదలైన సీతారామం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా రష్మిక ప్రధాన పాత్రలో హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా క్లాస్ ప్రేక్షకులను మెప్పించింది. హను రాఘవపూడి కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆరు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాగా వీక్ డేస్ లో సైతం ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయి.

ఫుల్ రన్ లో ఈ సినిమా బయ్యర్లకు భారీ లాభాలను అందించడం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమాను ఇద్దరు టాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేశారని సమాచారం అందుతోంది. న్యాచురల్ స్టార్ నాని, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిలను దర్శకుడు హను రాఘవపూడి సంప్రదించగా వేర్వేరు కారణాల వల్ల ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాలో నటించలేమని వెల్లడించారని సమాచారం అందుతోంది. నాని లేదా రామ్ ఈ సినిమాలో నటించి ఉంటే ఈ సినిమా రేంజ్ ఖచ్చితంగా మరింత పెరిగి ఉండేదని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

నాని, రామ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలిసి ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో తెలుగులో దుల్కర్ సల్మాన్ మార్కెట్ కూడా పెరుగుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. సీతారామం సినిమా ఇప్పటివరకు 26 కోట్ల 74 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించింది.

ఇతర ఏరియాలతో పోల్చి చూస్తే నైజాం, ఓవర్సీస్ లో ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధించింది. ఫుల్ రన్ లో ఈ సినిమా 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus