Varasudu Movie: ఆ ఇద్దరు హీరోలు వారసుడు మూవీని రిజెక్ట్ చేశారా?

విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు మూవీ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఒకరైన విజయ్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. వారసుడు సినిమాకు వంశీ పైడిపల్లి డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మొదట పరిశీలించిన హీరోలు ఎవరనే ప్రశ్నకు మాత్రం మహేష్ బాబు, చరణ్ పేర్లు జవాబుగా వినిపిస్తున్నాయి. స్వయంగా దిల్ రాజు ఈ విషయాలను వెల్లడించడంతో నమ్మాల్సి వస్తోంది.

దిల్ రాజు మాట్లాడుతూ వంశీ పైడిపల్లి వారసుడు మూవీని మొదట మహేష్ బాబుతో తీయాలని అనుకున్నారని మహేష్ బాబు మరో ప్రాజెక్ట్ తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాలో చేయలేకపోయారని దిల్ రాజు అన్నారు. ఆ తర్వాత ఈ సినిమాలో రామ్ చరణ్ గారిని హీరోగా ఎంపిక చేయాలని అనుకున్నామని ఆయన కామెంట్లు చేశారు. అప్పటికే చరణ్ శంకర్ కాంబో మూవీకి సంబంధించి చర్చలు జరుగుతుండటంతో విజయ్ ను సంప్రదించి

ఈ ప్రాజెక్ట్ లో విజయ్ ను ఫైనల్ చేయడం జరిగిందని దిల్ రాజు వెల్లడించడం గమనార్హం. వారసుడు సినిమాలో విజయ్ కు జోడీగా రష్మిక నటించిన సంగతి తెలిసిందే. వారసుడు సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని దిల్ రాజు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దిల్ రాజు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా సంక్రాంతి పండుగ కానుకగా రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండటం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాకు కలెక్షన్లు రావడం సులువు కాదు. వారసుడు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి హిట్ గా నిలవనుందో చూడాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus