దీపావళికి పోటీ పడబోతున్న యంగ్ హీరోల సినిమాలివే?

సాధారణంగా పండుగలు ఏవైనా వస్తే పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధమవుతుంటాయి. ఈ క్రమంలోని చిన్న హీరోలనుంచి మొదలుకొని స్టార్ హీరోల సినిమాలు కూడా పండుగ బరిలో దిగి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటాయి. అయితే తాజాగా దసరా పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నాగార్జున నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇక త్వరలోనే దీపావళి పండుగ రానున్న సందర్భంగా దీపావళి పండుగను పురస్కరించుకొని యంగ్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలోనే దీపావళి బరిలో యంగ్ హీరో విశ్వక్ నటించిన ఓరి దేవుడా సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమా ఇదివరకే ఎప్పుడు విడుదల కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్పెషల్ రోల్ లో నటించారు. మంచు విష్ణు ఈశాన్ సూర్య దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం జిన్నా.

అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిన ఈ సినిమా దసరా కానుకగా విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో దసరా భరి నుంచి తప్పుకొని దీపావళి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘ప్రిన్స్’.అనుదీప్ కెవి దర్శకత్వంలో ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన బాలీవుడ్ ఫిల్మ్ రామ్ సేతు కూడా దీపావళి కానుకగా విడుదల కానుంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 25వ తేదీ విడుదల కానుంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus