ఈ బంధం 30 ఏళ్లు కొనసాగాలి: ప్రదీప్‌ మాచిరాజు

టీవీలు చూసేవాళ్లకు ప్రదీప్‌ మాచిరాజు తెలియని వాళ్లుండరు. అన్ని టీవీ ఛానల్స్‌లో ఏదో కార్యక్రమంలో కనిపిస్తూ అలరిస్తూ ఉంటాడు. అలాంటి ప్రదీప్‌ను సినిమాల్లో చూస్తే బాగుంటుంది అని చాలామంది అనుకుంటూ వచ్చారు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో థియేటర్లలో ప్రదీప్‌ సందడిని చూపించే ప్రయత్నం జరిగింది. అయితే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రదీప్‌ మాట్లాడుతూ… తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు.

‘‘ఎన్నో వేడుకల్లో వ్యాఖ్యాతగా స్టేజ్‌పై నిల్చొని హీరోహీరోయిన్లను వేదికపైకి ఆహ్వానించేవాడిని. కానీ మొదటిసారి.. హీరో ప్రదీప్‌ అని నన్ను స్టేజ్‌ మీదకు ఆహ్వానించగానే భయంగా అనిపించింది. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన, నాకెంతో అండగా నిలిచిన ప్రేక్షకులందరికీ పాదాభివందనాలు. నా మీద మీరు చూపించిన ప్రేమాభిమానాల వల్లే నా ప్రయాణం సులువుగా సాగింది. రియల్‌లైఫ్‌లో నాకు అన్నయ్య లేరు. కానీ మా డైరక్టర్‌ మున్నా రూపంలో ఓ అన్నయ్య ఉన్నారు. మున్నా అన్న అసలు పేరు కూడా ప్రదీపే. మేమిద్దరం మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మా బంధం 30 ఏళ్లపాటు ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా’’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు ప్రదీప్‌.

‘‘మధురానగర్‌, వెంగళ్రావునగర్‌ రోడ్లపై సైకిల్‌పై తిరుగుతూ… థియేటర్ల ముందు నిల్చొని సినిమా పోస్టర్లు చూసిన మిడిల్‌క్లాస్‌ అబ్బాయిని నేను. అలాంటిది ఈరోజు అదే థియేటర్‌లో నా సినిమా చూసేంతవరకూ తీసుకువచ్చింది ఆ ఇద్దరు దేవుళ్లే. వాళ్లే మా అమ్మా నాన్న. ఇప్పటివరకూ నేను ఏ షో చేసినా, ఏ సినిమా చేసినా వాళ్లు రాలేదు. నా కోసం మొదటిసారి ఈ ఫంక్షన్‌కు వచ్చారు. నా లైఫ్‌ జర్నీలో వాళ్లు నాకెంతో సపోర్ట్‌ ఇచ్చారు’’ అంటూ తన తల్లిదండ్రుల గురించి చెప్పుకొచ్చాడు ప్రదీప్‌.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus