OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఓజి’ (OG). సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ఈ సినిమా గ్లింప్స్ తోనే భారీ హైప్ ను సొంతం చేసుకుంది.గ్యాంగ్స్టర్ ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ ది బెస్ట్ ఇచ్చారు.సెప్టెంబర్ 25న ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.

OG Collections

సెప్టెంబర్ 24 రాత్రి నుండే ప్రీమియర్ షోలు కూడా వేశారు. వాటికి మంచి స్పందన లభించింది. దీంతో పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. కానీ 2వ రోజు నుండి కలెక్షన్స్ కొంచెం డౌన్ అయ్యాయి. ఓ పక్క భారీ వర్షాలు అలాగే భారీగా పెరిగిన టికెట్ రేట్ల కారణంగా ‘ఓజి’ ని చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు రావడం లేదు.

ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 34.1 cr
సీడెడ్ 14.88 cr
ఉత్తరాంధ్ర 10.04  cr
ఈస్ట్ 9.2 cr
వెస్ట్ 6.32 cr
గుంటూరు 8.78 cr
కృష్ణా 6.86 cr
నెల్లూరు 2.98 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 93.16 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 11.88 cr
ఓవర్సీస్ 27.98 cr
టోటల్ వరల్డ్ వైడ్ 133.02 (షేర్)

‘ఓజి’ (OG) చిత్రానికి రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.174 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.133.02 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.215 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.40.98 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. దసరా పండుగ సెలవుల్ని వాడుకుని ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే టికెట్ రేట్లు తగ్గించాలి. అప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లి చూస్తారు.

 ‘కె ర్యాంప్‌’… బూతు కాదట, పెద్ద అర్థమే ఉందట.. ఎంత క్లారిటీ ఇచ్చినా డౌటే

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus