“ఉయ్యాల జంపాల (Uyyala Jampala) , సినిమా చూపిస్తా మావ (Cinema Chupista Maava) , కుమారి 21ఎఫ్ (Kumari 21F) ” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టినప్పుడు కూడా రాజ్ తరుణ్ (Raj Tarun) పేరుకి ప్రస్తుతం ఉన్నంత క్రేజ్ రాలేదు. ప్రస్తుతం అతడికి పేరు మీడియాలో అంతగా నానడానికి కారణం ఏమిటి అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సరిగ్గా వారం క్రితమే “పురుషోత్తముడి”గా పలకరించిన రాజ్ తరుణ్ ఈవారం “తిరగబడర సామి” (Thiragabadara Saami) అంటూ మరోసారి థియేటర్లలోకి వచ్చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: తప్పిపోయిన పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు చేర్చడం ధ్యేయంగా బ్రతుకుతుంటాడు గిరి (రాజ్ తరుణ్), అందుకు కారణం అతను కూడా చిన్నప్పుడు జాతరలో తప్పిపోయి తల్లిదండ్రులకు దూరమవ్వడమే. ఈ క్రమంలో కొండారెడ్డి (మకరంద్ పాండే) (Makrand Deshpande) ఒకర్ని వెతికిపెట్టాలని కోరతాడు. ఆ డీల్ తో గిరి లైఫ్ గ్రాఫ్ మారిపోతుంది. అసలు కొండారెడ్డి ఎవర్ని వెతకమన్నాడు? వాళ్ళతో గిరికి సంబంధం ఏమిటి? అనేది “తిరగబడర సామి” కథాంశం.
నటీనటుల పనితీరు: సినిమా ఎలాంటిదైనా, ఏ తరహా పాత్రైనైనా సరే తనకు కుదిరినంతలో పండించడంలో రాజ్ తరుణ్ ఎప్పుడూ ముందుంటాడు. ఈ సినిమాలోనూ గిరి పాత్రను పండించేందుకు తన మేర ప్రయత్నం చేశాడు. పాత్ర పండలేదు అది వేరే విషయం అనుకోండి. మాల్వి మల్హోత్ర (Malvi Malhotra) గ్లామర్ ను యాడ్ చేయగా.. మన్నా (Mannara Chopra) సినిమాకి యాడ్ చేద్దామనుకున్న గ్లామర్ రోతగా ఉంది. ఆమె పాత్ర కానీ, ఆమె ఎత్తుపల్లాలను వెండితెరపై అన్వేషిస్తూ ఇరికించిన పాట కానీ చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. మకరంద్ ఎప్పట్లానే విలనిజాన్ని వీరలెవల్లో పండించాడు.
సాంకేతికవర్గం పనితీరు: ఫలానా టెక్నికాలిటీ బాగుంది అని చెప్పే స్థాయిలో ఒక్కటంటే ఒక్క టెక్నీషియన్ పనితనం కూడా లేకపోవడం నిజానికి బాధాకరం. సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ ఇలా అన్నీ డిపార్ట్మెంట్స్ చాలా పేలవమైన పనితనంతో సినిమాకు మైనస్ అయ్యారు.
ఇక దర్శకుడు కె.ఎస్.రవికుమార్ (A. S. Ravi Kumar Chowdary) ఇంకా 90’s మేకింగ్ స్టైల్లోనే ఇరుక్కుపోయాడని ప్రతి ఫ్రేమ్ తో ప్రూవ్ చేస్తూనే వచ్చాడు. ముఖ్యంగా మన్నారా చోప్రా పాత్రను అతను డిజైన్ చేసి, తెరపై చూపించిన విధానం బీగ్రేడ్ సినిమాల స్థాయిల ఉండడం గమనార్హం. దర్శకుడిగా, కథకుడిగా, రచయితగా కె.ఎస్.రవికుమార్ దారుణంగా విఫలమయ్యాడు.
విశ్లేషణ: రాజ్ తరుణ్ కెరీర్లో అత్యంత పేలవమైన చిత్రంగా “తిరగబడర సామి” నిలుస్తుంది. రాజ్ తరుణ్ వీరాభిమానులు తప్ప మరెవరూ ఈ చిత్రాన్ని థియేటర్లో కూర్చుని రెండు గంటలపాటు భరించలేరు!
ఫోకస్ పాయింట్: వద్దులేరా సామి!
రేటింగ్: 1/5
Rating
1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus