Thiru Review: తిరు సినిమా రివ్యూ & రేటింగ్!

ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా తమిళ చిత్రం “తిరుచిత్రాంబలం”. రీమేక్ స్పెషలిస్ట్ మిత్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం పాటలు, టీజర్ & ట్రైలర్ ఫ్యామిలీ సెక్షన్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: తిరు (ధనుష్) ఓ సాధారణ మధ్యతరగతి యువకుడు. తండ్రితో ఏర్పడిన సమస్యల కారణంగా చాలా కష్టపడుతుంటాడు. అయితే.. చిన్నప్పటి స్నేహితురాలు శోభన (నిత్యామీనన్) ఎల్లప్పుడూ తిరుకు తోడుగా నిలుస్తుంది. అతడి బాధను, కోపాన్ని పంచుకుంటుంది. ఫుడ్ డెలివరీ బాయ్ అయిన తిరు ఈ క్రమంలో అనూష (రాశీఖన్నా), రంజని (ప్రియ భవానీ శంకర్)లను ప్రేమిస్తాడు కానీ.. వాళ్ళతో ప్రేమ ప్రయాణం పెళ్లి దాకా వెళ్లదు. అసలు తిరుకు తండ్రితో ఉన్న సమస్య ఏమిటి? తిరు-శోభన నడుమ స్నేహం చివరికి ఏ తీరానికి చేరింది? అనేది “తిరు” చిత్ర కథాంశం.

నటీనటుల పనితీరు: మధ్య తరగతి యువకుడిగా నటించడం ధనుష్ కి కొత్త కాదు. ఈ చిత్రంలో తిరు పాత్రలో జీవించేశాడు. నిత్యామీనన్ తో ధనుష్ కెమిస్ట్రీ చక్కగా వర్కవుటయ్యింది. నిత్యామీనన్ ఈ చిత్రానికి ఒక పాజిటివ్ ఎనర్జీ యాడ్ చేసింది. అలాగే.. రాశీఖన్నా & ప్రియ భవానీ శంకర్ లు గ్లామర్ ను యాడ్ చేశారు. ప్రకాష్ రాజ్, భారతీరాజాలు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు: “తిరు” మనం ఇప్పటికే పదులసార్లు చూసిన కథ-కథనం. అయితే.. ఎమోషన్స్ ను కొత్తగా ప్రెజంట్ చేశాడు దర్శకుడు మిత్రన్. ధనుష్-నిత్యామీనన్ ల ఫ్రెండ్ షిప్ ను ప్రొజెక్ట్ చేసిన విధానం, ధనుష్ లవ్ స్టోరీస్ ను మిడిల్ క్లాస్ ఆడియన్స్ & యూత్ కి కనెక్ట్ చేసేలా తెరకెక్కించిన తీరు సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. అలాగే.. ఫాదర్ ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేశాడు.

అనిరుధ్ సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్. హృదయానికి హత్తుకొనే పాటలు, ఎమోషన్స్ ను ఎలివేట్ చేసే చక్కని నేపధ్య సంగీతంతో సినిమాకి ఎస్సెట్ లా నిలిచాడు అనిరుధ్. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

విశ్లేషణ: ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూసి చాన్నాళ్లవుతోంది. ఆ లోటును తీర్చిన సినిమా “తిరు”. తెలుగు డబ్బింగ్ వెర్షన్ పై పెట్టిన శ్రద్ధ కూడా బాగుంది. కాస్త తమిళ నేటివిటీ భరించగలిగితే.. “తిరు” ఫ్యామిలీ ఆడియన్స్ ను కచ్చితంగా ఆకట్టుకుంటుంది.


రేటింగ్: 2.5/5 

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus