స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) చిరుత (Chirutha) సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టగా మగధీర (Magadheera) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆరెంజ్ (Orange) , తుఫాన్(Thoofan) , బ్రూస్ లీ (Bruce Lee: The Fighter) , వినయ విధేయ రామ(Vinaya Vidheya Rama) , ఆచార్య (Acharya) సినిమాలు ఫ్లాపైనా చరణ్ నటించిన మిగతా సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన నేపథ్యంలో విజయవంతంగా రామ్ చరణ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ 15వ సినిమాగా తెరకెక్కుతోంది.
18 ఏళ్ల సినీ కెరీర్ లో రామ్ చరణ్ కేవలం 15 సినిమాల్లో మాత్రమే నటించినా చాలామంది హీరోలతో పోల్చి చూస్తే ఎక్కువ సక్సెస్ రేట్ ను కలిగి ఉన్నారు. గేమ్ ఛేంజర్ (Game changer) సినిమాతో మరోమారు రామ్ చరణ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గేమ్ ఛేంజర్ సినిమా దిల్ రాజు (Dil Raju) బ్యానర్ లోనే భారీ మూవీగా తెరకెక్కుతోంది.
ఈ మధ్య కాలంలో హీరోల కెరీర్ లోని క్రేజీ సినిమాలను రీరిలీజ్ చేసే ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా కొన్ని నెలల క్రితం రీరిలీజ్ కాగా మగధీర సినిమా తాజాగా రీరిలీజ్ అయింది. విచిత్రం ఏంటంటే అప్పట్లో హిట్ గా నిలిచిన మగధీర సినిమాకు రీరిలీజ్ లో ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ఆరెంజ్ సినిమా అప్పట్లో ఫ్లాప్ గా నిలవగా రీరిలీజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఆరెంజ్ విషయంలో అలా మగధీర విషయంలో ఇలా జరగడంతో షాకవ్వడం ఫ్యాన్స్ వంతవుతోంది. మగధీర సినిమాకు ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేసి ఉంటే ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ నటించిన మరికొన్ని సినిమాలు రాబోయే రోజుల్లో రీరిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
టిల్లు స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ది గోట్ లైఫ్: ఆడు జీవితం సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ మైనపు విగ్రహం చూశారా? అదగొట్టేశారు!