Chiru, Balayya: సంక్రాంతికి రికార్డులు క్రియేట్ కావాలంటే ఇలా చేయాల్సిందే!

2023 సంక్రాంతి పండుగకు భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండటం, ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొనడంతో సంక్రాంతి సినిమాల హవా మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కకపోవడం ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ను ఫీలయ్యేలా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సినిమాలన్నీ ఇప్పటికే రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకోగా తక్కువ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ కావడం వల్ల ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయడం సులువు కాదు.

అయితే చిరంజీవి, బాలయ్య, ఈ సినిమాల నిర్మాతలు ఒక్క పని చేస్తే మాత్రం ఈ రెండు సినిమాలకు కచ్చితంగా ప్లస్ అవుతుంది. బీస్ట్, కేజీఎఫ్2 సినిమాలు తమిళనాడులో రిలీజైన సమయంలో కేజీఎఫ్2 సినిమాకు తక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కాయి. అయితే కేజీఎఫ్2 సినిమాకు అదనపు షోలకు అనుమతులు తెచ్చుకోవడం ద్వారా ఆ సినిమా థియేటర్ల సమస్యను అధిగమించింది. చిరంజీవి ఏపీ ప్రభుత్వం సహాయంతో, బాలయ్య తెలంగాణ ప్రభుత్వం సహాయంతో సంక్రాంతి సినిమాలకు అదనపు షోలకు అనుమతులు తెచ్చుకుంటే అన్ని సినిమాలకు ప్లస్ అవుతుంది.

థియేటర్ల సంఖ్యను పెంచలేం కాబట్టి హీరోలు, నిర్మాతలు ఈ విధంగా చేస్తే మంచిది. మైత్రీ నిర్మాతలు సైతం ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అదనపు షోలకు అనుమతులు లభిస్తే నిర్మాతలకు షేర్ రూపంలో లాభాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. చిరంజీవి, బాలయ్య తలచుకుంటే సంక్రాంతి థియేటర్ల సమస్యలను పరిష్కరించడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వేర్వేరుగా 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కావడం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి పెద్ద సీజన్ కావడంతో దర్శకనిర్మాతలు సంక్రాంతికే సినిమాలను రిలీజ్ చేయాలని పట్టుబట్టడంతో థియేటర్ల సమస్య ఎదురైంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus