రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలవుతుండగా ఇతర భాషల్లో సైతం ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ జరగడం లేదు. ఈ సినిమాకు పోటీ భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో స్కంద మేకర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సినిమా రిజల్ట్ పై ప్రభావం పడుతుంది.
మరోవైపు స్కంద మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ ట్రైలర్ ఉండనుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. స్కంద మూవీకి చివరి అద్భుతమైన అవకాశం ఇదేనని ఈ అద్భుతమైన అవకాశాన్ని మేకర్స్ వినియోగించుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్కంద మూవీకి విడుదలకు ముందే భారీ స్థాయిలో లాభాలు వచ్చాయి.
స్కంద (Skanda) మూవీని భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరో రామ్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం చాలా కీలకమని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే రామ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. శ్రీలీల హీరోయిన్ గా నటించడం వల్ల ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది. శ్రీలీలకు ఈ సినిమా తెలుగులో హ్యాట్రిక్ అందిస్తుందేమో చూడాలి.
బోయపాటి శ్రీను ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. స్కంద సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కనుందని ఈ సీక్వెల్ భారీ స్థాయిలో ఉండనుందని సమాచారం అందుతోంది. స్కంద మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!