Baahubali, Salaar: బాహుబలి, సలార్ సినిమాల మధ్య ఉన్న ఈ పోలిక గురించి మీకు తెలుసా?

స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ ఏదనే ప్రశ్నకు బాహుబలి2 పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన బాహుబలి2 సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. రాజమౌళి సినీ కెరీర్ లో సైతం ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉందనే సంగతి తెలిసిందే. అయితే బాహుబలి కథను జక్కన్న ఈ సినిమా తీయడానికి 15 సంవత్సరాల ముందే సిద్ధం చేసుకున్నారు. స్టూడెంట్ నంబర్1 సినిమా సమయంలోనే బాహుబలి గురించి జక్కన్న ప్రస్తావించేవారని రాజీవ్ కనకాల చెప్పేవారు.

బాహుబలి విషయంలో జరిగినట్టుగా సలార్ సినిమా కథను కూడా ప్రశాంత్ నీల్ దాదాపుగా 20 సంవత్సరాల క్రితమే రాసుకున్నారు. ఇన్నేళ్ల పాటు సలార్ కథను ప్రశాంత్ నీల్ డెవలప్ చేస్తూ వచ్చి ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. సలార్1 మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల అవుతోంది. సలార్1 ప్రమోషన్స్ లో భాగంగా ప్రశాంత్ నీల్ తన డైరెక్షన్ లో తెరకెక్కే మరికొన్ని సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.

బాహుబలి స్క్రిప్ట్ లా సలార్ స్క్రిప్ట్ కూడా చాలా సంవత్సరాల క్రితం సిద్ధమైనా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కాన్సెప్ట్ తో తెరకెక్కిన నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ సలార్ రిలీజ్ కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండగా సలార్ నుంచి రిలీజ్ కానున్న మరో ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సలార్ (Salaar) సెకండ్ ట్రైలర్ ఫ్యాన్స్ ను పూర్తిస్థాయిలో మెప్పించేలా ఉంటుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ప్రభాస్ భాషతో సంబంధం లేకుండా కెరీర్ పరంగా మరింత సత్తా చాటుతారేమో చూడాలి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus