యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమాలో హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు ఆ సినిమా మేకర్స్ నుంచి సరైన సమాధానం లభించడం లేదు. మొదట ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా ఎంపికైందని కామెంట్లు వినిపించాయి. అయితే ఆ తర్వాత రెమ్యునరేషన్ విషయంలో సమస్యో ఇతర కారణమో తెలీదు కానీ అలియా భట్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాలో దీపికా పదుకొనే, రష్మిక పేర్లు వినిపించాయి.
అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడటం లేదు. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే, సాయిపల్లవి పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్టీఆర్30 మేకర్స్ త్వరగా హీరోయిన్ కు సంబంధించి క్లారిటీ ఇస్తే బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వైరల్ అవుతున్న వార్తల వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం తెగ ఫీలవుతున్నారు. ఎన్టీఆర్ సినిమాను పలువురు హీరోయిన్లు రిజెక్ట్ చేశారని జరుగుతున్న ప్రచారం ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోంది. జులైలో ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. బరువు తగ్గుతున్న ఎన్టీఆర్ తన లుక్ ను పూర్తిగా మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఉండనుందని సమాచారం. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాకు బిజినెస్ ఆఫర్లు సైతం అదే విధంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. రాజమౌళి సినిమాలో నటించిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ను ఈ సినిమాతో తారక్ బ్రేక్ చేస్తారో లేదో చూడాలి.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!