Bhagavant Kesari: భోళా విషయంలో జరిగిందే భగవంత్ కేసరి విషయంలో రిపీట్ కానుందా?

Advertisement

కరోనా థర్డ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజవుతున్న సినిమాలలో హిట్ టాక్ వచ్చిన సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండగా ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు మాత్రం ఆశించిన రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిలవుతున్నాయి. భగవంత్ కేసరి సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని ఇప్పటికే ఈ సినిమా మేకర్స్ నుంచి స్పష్టత వచ్చింది. భగవంత్ కేసరి మూవీ ప్రమోషన్స్ విషయంలో కూడా వేగం పుంజుకుంది.

అయితే భగవంత్ కేసరి మేకర్స్ టికెట్ రేట్ల పెంపు కోసం ప్రయత్నించినా ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఏపీలో భగవంత్ కేసరి మూవీకి టికెట్ రేట్ల పెంపు కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కారణాల వల్ల ఏపీలో భోళా శంకర్ సినిమాకు టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి అనుమతులు లభించలేదు. భోళా విషయంలో జరిగిందే భగవంత్ కేసరి విషయంలో రిపీట్ కానుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

భగవంత్ కేసరి (Bhagavant Kesari) ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపు కోసం మేకర్స్ ప్రయత్నిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైందని సమాచారం అందుతోంది. భగవంత్ కేసరి సినిమాలో కాజల్, శ్రీలీల నటిస్తున్నారు. బాలయ్య, కాజల్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే కాగా జూనియర్ ఎన్టీఆర్ కు లక్కీ హీరోయిన్ అయిన కాజల్ బాలయ్యకు కూడా లక్కీ హీరోయిన్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాలో టీచర్ రోల్ లో కాజల్ కనిపించనున్నారు. బాలయ్య నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. భగవంత్ కేసరి మూవీతో బాలయ్యకు హ్యాట్రిక్ దక్కుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus