Sai Pallavi: సాయిపల్లవి క్రేజ్ కు ప్రూఫ్ ఇదే.. రీరిలీజ్ లో ఇలాంటి రెస్పాన్స్ వస్తోందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తున్నారు. 80 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాయిపల్లవి అభినయ ప్రధాన పాత్రల్లోనే నటిస్తుండగా భవిష్యత్తులో ఆమె మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే సాయిపల్లవి మలయాళంలో నటించిన ప్రేమమ్ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది.

అయితే ఈ సినిమా ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది. ఈ సినిమా రీరిలీజ్ కాగా రీరిలీజ్ లో ఈ సినిమాకు చెన్నైలో టికెట్లు దొరకడం లేదని సమాచారం అందుతోంది. ఈ నెల 1వ తేదీన తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఈ సినిమాను రీ రిలీజ్ చేయడం జరిగింది. ప్రేమమ్ అక్కడ రీరిలీజ్ కావడం తొలిసారి కాదు. 2016, 2017 సంవత్సరాలలో రీరిలీజ్ అయిన ఈ సినిమా తాజాగా మరోసారి రీరిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం.

చెన్నైలో రీ రిలీజ్ సినిమాకు టికెట్లు దొరకని పరిస్థితి అంటే ప్రేమమ్ లో సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతుంది. సాయిపల్లవి కెరీర్ లోని బెస్ట్ రోల్స్ లో ప్రేమమ్ మూవీ ముందువరసలో ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయిపల్లవి రెమ్యునరేషన్ పరిమితంగానే ఉంది. తెలుగులో ఈ బ్యూటీ ఎక్కువ సంఖ్యలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సాయిపల్లవి (Sai Pallavi) పెళ్లికి సంబంధించిన తీపికబురును ఎప్పుడు చెబుతారనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సాయిపల్లవి అభినయ ప్రధాన పాత్రలకే పరిమితం కావడం వల్ల ఆఫర్లు తగ్గాయని మరి కొందరు చెబుతున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus