Guntur Kaaram: గుంటూరు కారం నుంచి పూజ తప్పుకోవడానికి కారణం అదేనా?

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం గుంటూరు కారం ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది అయితే ఈ సినిమా షూటింగ్ పనులు కనక చూస్తుంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా బహుశా రాకపోవచ్చు అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ నత్తనడకన నడచడం అందుకు గల కారణం. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక కారణం చేత వాయిదా పడుతూ వస్తూనే ఉంది.

అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా పూజ హెగ్డే నటిస్తున్న సంగతి తెలుస్తుంది. అలాగే రెండో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు చాలా ఆలస్యం అవుతున్న తరుణంలో ఈ సినిమా విడుదలపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా నుంచి నటి పూజా హెగ్డే తప్పుకున్నారు అంటూ కూడ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై పూజా హెగ్డే టీం క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా పూజ టీం ఈ విషయంపై స్పందించి పూజా హెగ్డే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకున్నారని తెలియజేశారు.

(Guntur Kaaram) ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న తరుణంలో ఈమెకు ఇతర సినిమా షూటింగ్ కిచాలా ఇబ్బంది అవుతుందని కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోవడంతోనే ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అంటూ పూజ టీమ్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా నుంచి ఈమె తప్పుకోవడంతో రెండవ హీరోయిన్ గా ఉన్నటువంటి శ్రీ లీలను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus