ఒక సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులు ఉండటం కొత్తేమీ కాదు. గతంలో చాలా సినిమాల్లో ఇలాంటివి చూశాం. అయితే ఒకే సినిమాకు తండ్రీ కొడుకులు సంగీతం అందించడం మాత్రం చాలా అరుదు. ఆ మాటకొస్తే.. అలాంటి కాంబినేషన్లు మన దగ్గర తక్కువగా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇలాంటి కాంబోలో రూపొందిన చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా పని చేశారు. అయితే ఎందుకు అలా చేశారు అనే విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పుకొచ్చారు.
‘కస్టడీ’ సినిమా కోసం ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఎందుకు మ్యూజిక్ ఇచ్చారు అనేది సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. నేను కూడా సంగీత కుటుంబం నుండి వచ్చిన వాడినే కాబట్టి.. సినిమాలో ఎక్కడ ఎలాంటి మ్యూజిక్ ఉంటే బాగుంటుందో తెలుస్తుంది. అందుకనే ఈ సినిమాలో ఇద్దరు సంగీత దర్శకులను తీసుకున్నాను. సినిమాలో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఇద్దరూ తమ సంగీతంతో మ్యాజిక్ చేస్తారు అని చెప్పారు.
‘కస్టడీ’ (Custody) సినిమా ఇళయరాజా సంగీతంతో ప్రారంభమవుతుంది. యాక్షన్ మొదలవ్వగానే యువన్ శంకర్ రాజా వినిపిస్తారు అని చెబుతూ… సినిమా సంగీతంలో ఎవరి పార్ట్ ఏంటి అనేది చెప్పేశారు వెంకట్ ప్రభు. ఇళయరాజా పాటలు, బ్యాగ్రౌండ్ స్కోరు ఎప్పుడూ అద్భుతమే. మరోవైపు యువన్ శంకర్ రాజా సంగతి కూడా అంతే. మరి అలాంటిది ఇద్దరికీ వేర్వేరు పనులు ఎందుకు అప్పగించనట్లు అనేది వెంకట్ ప్రభు చెప్పినట్లు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
‘సరోజ’, ‘మానాడు’ లాంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు వెంకట్ ప్రభు. ఇప్పుడు ‘కస్టడీ’ సినిమాతో ఈ నెల 12న రాబోతున్నారు. నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి, శరత్ కుమార్ ఇతర కీలక పాత్రధారులు. తొలుత చైతన్యతో ‘మానాడు’ రీమేక్ చేద్దాం అనుకున్నా.. కొత్త కథతో ఇప్పుడొస్తున్నారు. మరి ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేశారో చూడాలి.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?