Bigg Boss Telugu 6: మిడ్ వీక్ ఎలిమినేషన్ ఫిక్స్..! సోషల్ మీడియాలో ఓటింగ్ నమ్మొచ్చా..?

బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఫిక్స్ అంటూ హోస్ట్ నాగార్జున ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి వరకూ ఓటింగ్ ని కన్సిడర్ చేస్తూ గురువారం ఎలిమినేషన్ చేస్తామని చెప్పారు. దీంతో ఇప్పుడున్న ఆరుగురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అన్ అఫీషియల్ లెక్కలు చూస్తుంటే శ్రీసత్య డేంజర్ లో కనిపిస్తోంది. అందరికంటే తక్కువ ఓటింగ్ శ్రీసత్యకే జరుగుతోంది.

కానీ, శ్రీసత్యని బిగ్ బాస్ టీమ్ పంపించేస్తుందా..? లేదా ? అనేది ఆసక్తికరం. ఇక్కడ ఈసారి మేల్ కంటెస్టెంట్ ని బయటకి పంపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదిరెడ్డి, రోహిత్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తే ఇద్దరు అమ్మాయిలు , ముగ్గురు అబ్బాయిలు ఫినాలేకి కౌంట్ సరిపోతుంది. అలా కాకుండా శ్రీసత్యని ఎలిమినేట్ చేస్తే మాత్రం కీర్తి ఒక్కతే ఉండిపోతుంది.

అయితే, ఇప్పుడున్న అన్ అఫీషియల్ లెక్కల్లో కీర్తి కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్, శ్రీసత్య నలుగురులో ఎవరైనా వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. సోషల్ మీడియాలో మాత్రం రేవంత్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడనే వార్త చక్కర్లు కొడుతున్నా, అందులో నిజం మాత్రం లేదనే అంటున్నారు. అన్ అఫీషియల్ ఓటింగ్ ని ఒక్కసారి చూసినట్లయితే.,రేవంత్ అందరికంటే ఎక్కువ ఓట్లుని కైవసం చేసుకుని టైటిల్ రేసులో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాత శ్రీహాన్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. వీరిద్దరు మాత్రమే సేఫ్. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఏదైనా జరగచ్చు.

అయితే, ఆదిరెడ్డి – రోహిత్ ఇద్దరిలో ఒకరిని పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఫైయిర్ గా చేస్తారా.. లేదా అన్ ఫైయిర్ ఎలిమినేషన్ చేస్తారా అనేది చూడాలి. ఫినాలే వీక్ కాబట్టి ఎప్పుడు ఎవరినైనా ఎలిమినేట్ చేయచ్చు. ఓటింగ్ క్లోజ్ అయ్యేవరకూ బుధవారం నైట్ వరకూ ఉంచి, బోటమ్ లో ఉన్న ఎవరినైనా పంపించేయచ్చు. ఎందుకంటే, ఓటింగ్ రీచ్ ని బట్టీ చూసి ఈ డెసీషన్ బిగ్ బాస్ టీమ్ తీస్కుంటుంది. అందుకే, ఇప్పుడు నలుగురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అదీ మేటర్.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus