Prabhas: ఇండియా అంతటా సత్తా చాటుతున్న ప్రభాస్!

బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు భారీస్థాయిలో కలెక్షన్లు సాధించడంతో పాటు ప్రభాస్ కు సినిమాసినిమాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్ నటించిన సాహో సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ప్రభాస్ తరువాత సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కడంతో పాటు భారీస్థాయిలో రిలీజ్ కానున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాకు సంబంధించి తాజాగా పది సెకన్ల వీడియో లీకైన సంగతి తెలిసిందే.

ఈ లీకైన వీడియో ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలవడం గమనార్హం. సలార్ లీకైన వీడియో కోట్ల మందికి చేరినా ఈ వీడియో ద్వారా ప్రభాస్ రేంజ్ ఏమిటో ప్రూవ్ అయింది. ఈ సినిమా రిలీజైన తర్వాత రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అభిమానం ఉందో ఈ వీడియో ద్వారా ప్రభాస్ అభిమానులకు సైతం తెలుస్తోంది.

ప్రభాస్ కు పెరుగుతున్న క్రేజ్ ను చూసి మిగతా స్టార్ హీరోలు సైతం టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సలార్ రిలీజ్ కానుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus