Rajamouli: రాజమౌళి సినిమాకు ఫ్లాప్ టాక్.. కలెక్షన్లు మాత్రం భారీ షాకిచ్చాయిగా!

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో విక్రమార్కుడు సినిమా కూడా ఒకటి కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది. అయితే ఈ సినిమా రిలీజైన సమయంలో క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. రవితేజ రోల్ విషయంలో ఇచ్చిన ట్విస్ట్ లకు సంబంధించి నెగిటివ్ కామెంట్లు చేశారు.

కొన్ని సీన్స్ బోల్డ్ గా ఉన్నాయని ఈ సినిమా విషయంలో కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే అటు మాస్ ప్రేక్షకులకు, ఇటు క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. రాజమౌళి రవితేజ కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. రాజమౌళి తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కేలా ప్లాన్ చేసుకుంటున్నారు. రాజమౌళి మహేష్ కాంబో మూవీ షూట్ వచ్చే ఏడాది మొదలుకానుంది. దాదాపుగా రెండు సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుంది.

రాజమౌళి (Rajamouli) రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉంది. 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకుంటున్న డైరెక్టర్లలో జక్కన్న ఉన్నారు. రాజమౌళి సినిమాల బడ్జెట్ లెక్కలు, టార్గెట్ లెక్కలు సైతం మారిపోతున్నాయి. రాజమౌళి రాబోయే రోజుల్లో భారీ సంచలనాలను సృష్టించాలని వేగంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజమౌళి కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus