ప్రభాస్ కృతి సనన్ హీరో హీరోయిన్లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఆది పురుష్. ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఐదు భాషలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి భారీగా నెగిటివ్ వార్తలను ప్రచారం చేస్తున్నారు.
ఇలా ఈ సినిమా గురించి వస్తున్నటువంటి నెగిటివ్ వార్తలపై మేకర్స్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ కొట్టి పారేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా చూసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అంటే వాట్సాప్ లో ఒక మెసేజ్ మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.ఈ సినిమా చూడటం కోసం థియేటర్లోకి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలను తప్పకుండా పాటించాలి అంటూ పెద్ద ఎత్తున ఈ మెసేజ్ వైరల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా చూసే సమయంలో ప్రేక్షకులు ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే… మద్యం మాంసం తిని తాగి థియేటర్లకు వెళ్ళకూడదు.అవసరమైతే అర్ధనగ్నంగా పంచ కట్టుకొని పైన కాషాయపు కండువా వేసుకొని వెళ్లడం చాలా మంచిదని చెబుతున్నారు. అలాగే సినిమా చూసేటప్పుడు చెప్పులు కూడా వేసుకోకూడదని నియమాలు పెడుతున్నారు. సినిమా చూస్తున్నంతసేపు జైశ్రీరామ్ అని పేరు తప్ప ఇతర నటీనటుల పేర్లు పలకకూడదట.
ఇక ఈ సినిమా (Adipurush) చూస్తున్న సమయంలో కుదిరితే స్క్రీన్ కు ఏ విధమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా కొబ్బరికాయ కొట్టాలని కూడా నియమాన్ని పెట్టారు.ప్రతి థియేటర్లోనూ హనుమంతుడి కోసం కేటాయించిన సీటును ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించి దూప దీపాలతో పూజించాలి. ఎట్టి పరిస్థితులలోనూ జైశ్రీరామ్ అనే నామస్మరణను ఆపకూడదు. ఇలా ఈ సినిమా చూస్తున్నంత సేపు ఈ నియమాలు పాటించాలన్న ఈ మెసేజ్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.