Devara: దేవర విషయంలో సెంటిమెంట్ ఫాలో అయితే బెటర్.. ఏమైందంటే?

  • September 23, 2024 / 09:36 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  కొరటాల శివ  (Koratala Siva)  కాంబోలో తెరకెక్కిన దేవర (Devara) మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ కావాల్సిన రిలీజ్ ట్రైలర్ వాయిదా పడింది. కొన్నిరోజుల క్రితం ఆయుధ పూజ సాంగ్ ను కూడా 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్ ఆ సమయానికి రిలీజ్ చేయలేకపోయారు. ఆ టైమ్ దేవరకు అచ్చిరాలేదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Devara

దేవర సినిమాకు సంబంధించి సాయంత్రం సమయంలో వచ్చిన అప్ డేట్స్ సరైన సమయానికి వచ్చాయి. మార్నింగ్ టైమ్ లో వచ్చిన అప్ డేట్స్ మాత్రం సరైన టైమ్ కు రావడం లేదు. దేవర మేకర్స్ ఈవినింగ్ సెంటిమెంట్ ను ఫాలో అయితే బాగుంటుందని చెప్పవచ్చు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుండగా ఈ ఈవెంట్ లో తారక్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏపీలో అర్ధరాత్రి నుంచి దేవర షోలు ప్రదర్శితం కానుండటం, గతంలో ఏ సినిమాకు ఇవ్వని స్థాయిలో ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం ఇవ్వడం గమనార్హం. నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు (Nandamuri Kalyan Ram) కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు. దేవర రిలీజ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

రిలీజ్ ట్రైలర్ అద్భుతంగా ఉంటే మాత్రమే దేవరపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. దేవర మూవీ సరికొత్త రికార్ద్స్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండగా అర్ధరాత్రి షోలు ఈ సినిమాకు ఎంతమేర ప్లస్ అవుతాయో చూడాల్సి ఉంది. దేవర1 హిట్టైతే టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus