ఈవారం డబుల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యింది వీళ్లే..!

బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం ఎలిమినేన్ లో బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. డబుల్ ఎలిమినేషన్ ఈవారం ఉండబోతోందని, అందుకోసం ఎవరు వెళ్లిపోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. గతవారం గీతుని ఎలిమినేట్ చేసి హై డ్రామా క్రియేట్ చేసిన బిగ్ బాస్ టీమ్ ఈవారం డబుల్ ఎలిమినేషన్ లో షాకింగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. అసలు ఎవరు వెళ్లిపోబోతున్నారు అనేది మనం చూసినట్లయితే, ఈవారం నామినేషన్స్ లో తొమ్మిది మంది ఉన్నారు. నలుగురు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు.

ఇందులో అందరికంటే టాప్ లో ఉన్నాడు రేవంత్. రేవంత్ కి ఆల్ మోస్ట్ 22 పర్సెంట్ వరకూ ఓటింగ్ అనేది జరిగింది. ఆ తర్వాత అనుహ్యంగా ఓటింగ్ లో దూసుకు వచ్చింది ఇనాయా.అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ప్రకారం చూస్తే ఇనాయకి 20 పర్సెంట్ వరకూ ఓటింగ్ అనేది జరిగింది. శ్రీహాన్ ని సైతం ఓవర్ టేక్ చేసి రేవంత్ కి గట్టి పోటీ ఇచ్చింది. శ్రీహాన్ మూడో ప్లేస్ లో సేఫ్ జోన్ లో ఉన్నాడు. 12శాతం వరకూ ఓటింగ్ ని కైవసం చేస్కున్నాడు. తన ఓట్ బ్యాంక్ ని అయితే జాగ్రత్తగా కాపాడుకున్నాడు.

ప్రతివారం లాగానే సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత రివ్యూవర్ ఆదిరెడ్డికి కూడా 8శాతం వరకూ ఓటింగ్ అనేది జరిగింది. సేఫ్ గానే ఉన్నాడు. ఆదిరెడ్డికంటే లీస్ట్ లో ఉన్న ఐదుగురికి ఈక్వల్ గా ఓటింగ్ అనేది జరిగింది. వాళ్లందరికీ కూడా దాదాపుగా 7శాతం వరకూ ఓటింగ్ ని ప్రభావితం చేయగలిగారు వీళ్లలోనే డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. ఓటింగ్ లో లీస్ట్ లో ఫైమా, మెరీనా, బాలాదిత్య, వాసంతీ ఇంకా కీర్తి ఉన్నారు. ప్రస్తుతం హౌస్ లో ఎక్కువ మంది ఉన్నారు. టాప్ – 5 డిసైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరగాల్సిందే.

అందుకే బిగ్ బాస్ టీమ్ ఈ ఐదుగురిలో ఎవరిని ఇంటికి పంపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం చూస్తే ఫైమా, కీర్తి , వాసంతీ ముగ్గురూ కూడా సేఫ్ గానే ఉన్నారు. బాలాదిత్య, మెరీనా ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారని సమాచారం తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా క్లారిటీ రావాలి. ఎందుకంటే, లాస్ట్ వీక్ సీక్రెట్ రూమ్ లో గీతుని ఉంచారనే అనుమానం హౌస్ మేట్స్ కి ఉంది. అది ఇప్పుడు పోవాలంటే డబుల్ ఎలిమినేషన్ చేస్తే బాలాదిత్యని సీక్రెట్ రూమ్ లో ఉంచుతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అదీ మేటర్.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus