బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం ఎలిమినేషన్ అనేది రసవత్తరంగా మారింది. అన్ అఫీషియల్ సైట్స్ లో శోభాశెట్టి, అశ్విని ఇద్దరూ లీస్ట్ లో ఉన్నారు. దీంతో శోభాశెట్టిని కాపాడటం కోసమే ఇలా హౌస్ లో నో ఎలిమినేషన్ పెట్టారనే కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు మేటర్ ఏంటంటే., బిగ్ బాస్ హౌస్ లో యావర్ గేమ్ ఎలా చీట్ చేసి ఆడాడు అనేది చాలా క్లియర్ గా వీడియోతో సహా చూపించాడు హోస్ట్ నాగార్జున.
దీంతో నేను ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ పొందేందుకు అనర్హుడిని అంటూ యావర్ దాన్ని తిరిగి బిగ్ బాస్ కి ఇచ్చేశాడు. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఈ పాస్ ని స్టోర్ రూమ్ లో పెట్టాడు. అయితే, సండే ఎపిసోడ్ లో దీన్ని తిరిగి యావర్ కి ఇస్తూ ఒకరిని సేఫ్ చేయమని చెప్పాడు. దీంతో యావర్ ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈసారి జంటలు జంటలుగా బిగ్ బాస్ ఇద్దరినీ సేఫ్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ లో ప్రియాంక, యావర్ సేఫ్ అయ్యారు.
ఆ తర్వాత అర్జున్ – అమర్ దీప్ సేఫ్ అయ్యారు. ఆ తర్వాత రతిక – శోభాశెట్టి ఇద్దరూ సేఫ్ అయ్యారు. ఆ తర్వాత గౌతమ్ ఇంకా అశ్విని ఇద్దరి మద్యలో ఉత్కంఠ మొదలైంది. ఇద్దరిలో ఎవరు వెళ్లిపోతారు అనేది హౌస్ మేట్స్ లో టెన్షన్ ని రేపింది. దీంతో బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీపాస్ ని ఉపయోగించాలని చెప్పాడు. దీంతో ఇద్దరూ సేఫ్ అయ్యారు. హౌస్ లో ఎలిమినేషన్ లేకుండా పోయింది.
అయితే, ఇక్కడే స్టేజ్ పైన నాగార్జున వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఎనౌన్స్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈవారమే సింగిల్ ఎలిమినేషన్ చేయచ్చని, కానీ బిగ్ బాస్ టీమ్ సీరియల్ బ్యాచ్ ని కాపాడటం కోసమే ఇలా చేశారని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. ఇప్పుడు ప్రశాంత్ – యావర్ – శివాజీ – రతిక ఇలా వేరేవాళ్లు నామినేషన్స్ లోకి వచ్చినపుడు డబుల్ ఎలిమినేషన్ చేస్తారని చెప్తున్నారు. అసలు తెరవెనుక ఏం జరుగుతోంది. ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు.
బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) టీమ్ కావాలనే సీరియల్ బ్యాచ్ ని సేవ్ చేస్తోందని, అందుకే ఇలాంటి రూల్స్ పెట్టుకుంటూ ఉల్టా పుల్టా అంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్స్ నుంచీ కూడా ఇదే జరుగుతోందని, బిగ్ బాస్ టీమ్ మొత్తం సీరియల్ బ్యాచ్ కి వెన్నుదన్నుగా ఉంటూ వారికి ఎప్పుడూ సపోర్టింగ్ గా ఉంటోందనే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. టాస్క్ లు కూడా అలాగే డిజైన్ చేస్తున్నారంటూ బిగ్ బాస్ లవర్స్ అసహనానికి గురి అవుతున్నారు. ఇప్పుడు కూడా ఇలా నో ఎలిమినేషన్ పెట్టడం అనేది ఎంత వరకూ కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. అదీ మేటర్.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!