OTT Movies: ఓటీటీలో కుర్ర హీరోలు ఏం చేస్తారో చూడాలి..!

ఓటీటీలు కూడా థియేటర్లను ఫాలో అవుతున్నాయా? లేక ఓటీటీలకు సినిమాలు ఇచ్చే ముందు నిర్మాతల థియేటర్ల కాన్సెప్ట్‌ ఫాలో అవ్వాలని చెప్పకనే చెబుతున్నారా? ఈ డౌట్‌ ఎందుకు వచ్చిందా అని మీ డౌటా? ఈ వారం ఓటీటీలో సినిమాల స్ట్రీమింగ్‌ డేట్‌ చూస్తే మీకూ అదే డౌట్‌ వస్తుంది. కొత్త సంవత్సరం తొలి వారంలో ఓటీటీకి నాలుగు సినిమాలు వస్తున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఆ రెండూ కుర్ర హీరోవే కావడం గమనార్హం. ఇవి కాకుండా తమిళంలో మరో రెండు సినిమాలు కూడా వస్తున్నాయి.

ముందుగా చెప్పినట్లు ఈ వారం ఓటీటీ సినిమాలన్నీ జనవరి 7నే వస్తున్నాయి. అంటే శుక్రవారం. మన సినిమా వాళ్లు థియేటర్లకు ఫాలో అయ్యే కాన్సెప్ట్‌. వీకెండ్‌లో సినిమా వస్తే ఆరంభ వసూళ్లు బాగుంటాయనే ఆలోచన. ఇప్పుడు ఓటీటీలో ఎక్కువగా ఇదే కాన్సెప్ట్‌ వాడుతున్నారు. వారంతంలో అయితే స్ట్రీమింగ్స్‌ ఎక్కువగా ఉంటాయని అనుకుంటున్నారేమో. అలా ఈ వారం తెలుగులో నాగశౌర్య నుండి ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ వస్తున్నాయి. అవును శౌర్య కొత్త సినిమాలు రెండూ ఏడో తేదీనే స్ట్రీమ్‌ చేస్తున్నారు. అయితే వేర్వేరు ఓటీటీల్లో.

లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య, రీతూ వర్మ నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా అక్టోబరు 29న విడుదలైంది. తొలి రోజుల్లో సినిమాకు పాజిటివ్‌ బజ్‌ కనిపించినా… ఆ తర్వాత సరైన ఫలితం అందుకోలేకపోయింది. ఇప్పుడు జనవరి 7న జీ5 స్ట్రీమ్‌ అవుతుంది. ఇక నాగశౌర్య మరో సినిమా ‘లక్ష్య’ కూడా అదే రోజున ‘ఆహా’లో స్ట్రీమ్‌ అవుతుంది. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. సినిమా కోసం శౌర్య చాలా కష్టపడ్డాడు. కానీ ఫలితం లేకపోయింది. ఈ సినిమా థియేటర్లలో డిసెంబరు 10న వచ్చింది.

ఈ రెండు సినిమాలు కాకుండా… హిప్‌హాప్‌ తమిళ ప్రధాన పాత్రలో రూపొందిన తమిళ చిత్రం ‘అన్బరివు’ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో జనవరి 7న వస్తోంది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకి విడుదల చేస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘జైల్‌’ కూడా అదే రోజున సింప్లీ సౌత్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus