కొత్త సినిమాలు వచ్చాయి.. బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటి?

  • November 22, 2024 / 10:41 PM IST

నవంబర్ నెల అనేది సినిమాలకి అన్ సీజన్ అంటుంటారు. ఈ నెలలో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వవు. విడుదలయ్యే చిన్న, మధ్య తరగతి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ పెర్ఫార్మన్స్ ఇవ్వవు. ఇది మరోసారి ప్రూవ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఈరోజు అనగా నవంబర్ 22న విశ్వక్ సేన్ (Vishwak Sen)  ‘మెకానిక్ రాకీ’, సత్యదేవ్ ‘జీబ్రా’, గల్లా అశోక్ (Ashok Galla)   ‘దేవకీ నందన వాసుదేవ’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు ‘మందిర’ ‘కేసీఆర్'(కేశవ చంద్ర రామావత్) వంటి చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటి బాక్సాఫీస్ (Box Office) పెర్ఫార్మన్స్ ఏమాత్రం ఆసక్తిగా లేవు.

Box Office

‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) సినిమాకి మంచి టాక్ వచ్చింది. కానీ మొదటి రోజు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.రెండో రోజు ఏమైనా బెటర్ అవుతాయేమో చూడాలి.

సత్యదేవ్ (Satya Dev) ‘జీబ్రా’ (Zebra) సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుంది అంటున్నారు. ఇంకొంతమంది కష్టం అంటున్నారు. ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ చెప్పుకోదగ్గ రేంజ్లో లేవు.

మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) కి టాక్ బ్యాడ్ గానే ఉంది. ఓపెనింగ్స్ కూడా దారుణంగానే ఉన్నాయి. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అయ్యాయి. థియేటర్స్ లో 10 టికెట్లు కూడా సోల్డ్ అవుతున్న సందర్భాలు కనిపించడం లేదు.

ఇక మిగిలిన అన్ని సినిమాలు వాషౌట్ అయ్యాయి. సో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ప్రేక్షకులు ‘పుష్ప 2’ సినిమా కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా కోసమే డబ్బులు సేవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యినట్టు స్పష్టమవుతుంది. సో వచ్చే వారం అంటే నవంబర్ 29న, 30న విడుదలయ్యే సినిమాల పెర్ఫార్మన్స్ కూడా ఇలాగే ఉండొచ్చేమో.

ఆ టైమ్‌ ఇంత త్వరగా వస్తుందనుకోలేదు: రానా నమ్మిన దర్శకురాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus