ఆ టైమ్‌ ఇంత త్వరగా వస్తుందనుకోలేదు: రానా నమ్మిన దర్శకురాలు!

మన సినిమా ఘనతను ఇటీవల అంతర్జాతీయంగా చర్చించుకునేలా చేసిన సినిమాల్లో ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ ఒకటి. ముంబయిలోని ఇద్దరు నర్సుల కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా కాన్స్‌లో చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ‘గ్రాండ్‌ పిక్స్‌’ అవార్డుని కూడా గెలుచుకుంది. 30 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి కాన్స్‌ గౌరవం దక్కించిన చిత్రమది. ఈ సినిమాను ఇప్పుడు మన దేశంలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకురాలు పాయల్‌ కపాడియా మాట్లాడారు.

Rana

ఈ నెల 22న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు రానా (Rana Daggubati) . దీంతో సినిమా మీద మన దగ్గర కూడా కాస్త ఆసక్తి పెరిగింది. 2018లోనే సినిమా స్క్రిప్ట్‌ను మొదలుపెట్టారట పాయల్‌ కపాడియా. ఆమె బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని, దాంతో వారికి తోడుగా తాను చాలా రోజులు అక్కడే ఉండాల్సి వచ్చిందని చెప్పారు. అలా నర్సులతో మాట్లాడుతుండడగా.. వాళ్ల జీవితం గురించి బాగా అర్థమైంది అని చెప్పారు. ఆ అంశాలనే నేను సినిమాగా తీద్దాం అనిపించి.. ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ కథను రాసుకున్నా అని చెప్పారు.

తెరకెక్కించిన మొదటి చిత్రమే కాన్స్‌ చిత్రోత్సవంలో ప్రదర్శించడం, ప్రేక్షకులు.. విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. 30ఏళ్ల తర్వాత మళ్లీ తన చిత్రంతో భారత దేశం గురించి మాట్లాడుకుంటున్నారని సంబరపడ్డారామె. పాయల్‌ కపాడియాకు తెలుగు ప్రాంతంతో దగ్గర సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో పాయల్‌ కపాడియా 8వ తరగతి వరకూ చదువుకున్నారు.

అప్పుడు తెలుగు బాగానే వచ్చేదని, ఇప్పుడు అయితే తెలుగు భాషపై పట్టు కోల్పోయానని చెప్పారు. భవిష్యత్తులో తెలుగులో సినిమాలు తీయాల్సి వస్తే.. భాషపై పట్టు సాధించిన ఆలోచిస్తాను అని చెప్పారు. కంటెంట్‌ను నమ్ముకున్న సినిమాలను తెలుగుకు సమర్పకుడిగా అందిస్తున్న రానా (Rana) .. ఇటీవల ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu) అనే సినిమా అందించారు. నివేదా థామస్‌(Nivetha Thomas) ప్రధాన పాత్రలో రూపొందిన ఆ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus