Bigg Boss Telugu 5: మానస్ సేఫ్ జోన్ లో ఉంటే ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..?

బిగ్ బాస్ హౌస్ లో పైనల్ ఎలిమినేషన్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లాస్ట్ వీక్ అంటే 14వ వారం ఎవరు ఇంటి నుంచీ వెళ్లిపోతారా అనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠని రేకెత్తిస్తోంది. ఒకే ఒక ఎలిమినేషన్ హౌస్ లో మిగిలి ఉండటంతో ఎవరు వెళ్లిపోతారా అని ఇప్పుడు బిగ్ బాస్ వ్యూవర్స్ అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లలో షణ్ముక్ జస్వంత్, సన్నీలకి ఎలిమినేషన్ గండం లేదు.

ఇద్దరూ అన్ అఫీషియల్ సైట్స్ లో భారీగా ఓట్లు తెచ్చుకుంటున్నారు కాబట్టి, ఇద్దరూ సేఫ్ జోన్ లోనే ఉంటారు. అయితే, రీసంట్ గా రెండు మూడు రోజుల నుంచీ షణ్ముక్ జస్వంత్ , సిరిల మధ్యన జరుగుతున్న గొడవ కారణంగా షణ్ముక్ ఓటింగ్ అనేది బాగా పడిపోయింది. మరోవైపు అందరికీ ఇచ్చిపారేసే సిరి షణ్ముక్ విషయంలో ఎందుకు కామ్ గా ఉంటోందో ఆడియన్స్ కి అర్ధం కావట్లేదు, అందుకే సిరి ఓటింగ్ కూడా దారుణంగా పడిపోయింది. వీళ్లిద్దరిలో సిరి ఇప్పుడు డేంజర్ జోన్ లోకి వచ్చేసింది.

మానస్ కి విపరీతంగా ఓటింగ్ పడటం అనేది సిరికి బాగా మైనస్ అయ్యింది. అంతకుముందు రెండు రోజులు సేఫ్ జోన్ లోనే ఉన్న సిరి ఇప్పుడు డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. మానస్ సేఫ్ జోన్ లోకి రావడంతో సిరి, ఇంకా కాజల్ ఇద్దరిలోనే ఎలిమినేషన్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే, ఇక్కడే బిగ్ బాస్ కాల్ తీస్కుంటే మాత్రం మానస్ ని కూడా పంపించే ఛాన్స్ లేకపోలేదు.మానస్ సేఫ్ జోన్ లో ఉంటే మాత్రం సిరి, కాజల్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు.

అయితే, సిరి ఎలిమినేట్ అయితే అది షణ్ముక్ కి బాగా ప్లస్ అవుతుంది. బయట నుంచీ వచ్చే ఓటింగ్ అనేది షణ్ముక్ కి ఇంకా బాగా పెరుగుతుంది. ఫినాలే రేస్ లో ముందుకు వెళ్తాడు. అలాగే, కాజల్ ఎలిమినేట్ అయితే సన్నీకి మానస్ కి బాగా ప్లస్ అవుతుంది. కాజల్ కి పడే ఓటింగ్ పర్సెంటేజ్ అనేది సన్నీకి, మానస్ కి వస్తుంది. దీనివల్ల వీళ్లిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈసారి బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇస్తాడు అనేది చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus