Adi Reddy Eliminated: ఈవారం బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఏంటి ? ఓటింగ్ లో లీస్ట్ ఎవరంటే.,

బిగ్ బాస్ హౌస్ లో 14వ వారం నామినేషన్స్ లేకుండానే హౌస్ మొత్తాన్ని నామినేట్ చేశాడు బిగ్ బాస్. శ్రీహాన్ ఫినాలే టిక్కెట్ గెలుచుకున్నాడు కాబట్టి, నామినేషన్స్ లో లేడు. మిగతా ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. దీంతో ఇప్పుడు విన్నర్ డిసైడ్ వీక్ అని కూడా ప్రచారం మొదలైంది. అయితే, అన్ అపీషియల్ ఓటింగ్ లో మాత్రం చాలా తేడాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే, రేవంత్ ఫస్ట్ ప్లేస్ లో సేఫ్ గా ఉన్నాడు. ఈవారం సేఫ్ అయ్యి, పైనలిస్ట్ కూడా అవుతాడు.

అలాగే, ఇనయా సుల్తానా కూడా రేస్ లో ముందుకు దూసుకుపోతోంది. సూర్య గేమ్ నుంచీ అవుట్ అయినప్పటి నుంచీ కూడా గేమ్ బాగా ఆడుతోంది ఇనయా. అందుకే, సపరేట్ ఆడియన్స్ ని గెలుచుకుంది. రేవంత్ కి గట్టి పోటీ ఇస్తూ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత రోహిత్ కూడా మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ని కైవసం చేసుకుంటున్నాడు. రోహిత్ కూడా సేఫ్ గానే ఉన్నాడు. ఇక మిగిలిన ముగ్గురు మాత్రం డేంజర్ జోనే అనే చెప్పాలి. కీర్తి, శ్రీసత్య, ఇంకా ఆదిరెడ్డి ఈ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

ఫినాలే వీక్ లో టాప్ – 5 ఉండాలి అంటే, ఖచ్చితంగా ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరగాల్సి ఉంది. అలా జరిగితే ఈముగ్గురులో ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. అంటే అందులో ఆదిరెడ్డి కూడా ఉన్నాడు. నిజానికి ఆదిరెడ్డి ఫైనలిస్ట్ అని, రేవంత్ కి గట్టి పోటీ అని అనుకున్నారు అందరూ. కానీ, అన్ అఫీషియల్ ఓటింగ్ లో మాత్రం వెనకబడిపోయాడు. ఆదిరెడ్డి కి రేవంత్ కి జరిగిన ఆర్గ్యూమెంట్ లో నాగార్జున వీడియో చూపించేసరికి ఆదిరెడ్డికి క్రేజ్ కొద్దిగా తగ్గిపోయింది.

అలాగే, ఆదిరెడ్డి ఇప్పుడు రేస్ లో లేకుండా పోయాడు. అందుకే, ఆదిరెడ్డిని ఈవారం ఎలిమినేట్ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలా జరిగితే బిగ్బాస్ ఈవారం బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లే అవుతుంది. కానీ, ప్రస్తుతం సింగిల్ ఎలిమినేషన్ పెట్టి, సీజన్ – 6 కాబట్టి టాప్ – 6 మెంబర్స్ ని ఫినాలేకి తీస్కుని వెళ్తే మాత్రం ఆదిరెడ్డి సేఫ్ అయిపోతాడు. అప్పుడు శ్రీసత్య , లేదా కీర్తి ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

ఎందుకంటే, వీరిద్దరి కంటే కూడా అన్ అఫీషియల్ లెక్కల ప్రకారం ఆదిరెడ్డి కొద్దిగా టాప్ లోనే ఉన్నాడు. సో, సింగిల్ ఎలిమినేషన్ అయితే శ్రీసత్య వెళ్లిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. కీర్తి కంటే కూడా శ్రీసత్య కొద్దిగా వెనకబడింది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఆదిరెడ్డి , కీర్తి ఇద్దరిలో మరొకరు ఎలిమినేట్ అవుతారు. మొత్తానికి ఈవారం ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్ ఇచ్చేలాగానే ఉన్నాడు బిగ్ బాస్. అదీ మేటర్.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus