Bigg Boss Telugu 6: ఈవారం ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్..! ఏం జరగబోతోందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి వారం ఎలిమినేషన్ ఘట్టాన్ని చాలా రసవత్తరంగా ప్లాన్ చేస్తోంది బిగ్ బాస్ టీమ్. దీనికోసం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ పెట్టాలని చూస్తున్నారు. అందుకు ఇప్పుడు హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, ప్రస్తుతం హౌస్ లో దెయ్యం టాస్క్ నడుస్తోంది. ఇందులో అందరూ కూడా బెస్ట్ పెర్ఫామన్స్ ఇస్తున్నారు. అంతేకాదు, ప్రైజ్ మనీ రికవరీ టాస్క్ లలో కూడా చెలరేగి ఆడుతున్నారు.

దీంతో ఒక్కో పార్టిసిపెంట్ కి ఒక్కోలా ఓటింగ్ అనేది జరుగుతోంది. ఇప్పుడు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది చెప్పలేని పరిస్థితిగా మారింది. అయితే, అన్ అఫీషియల్ పోలింగ్స్ ప్రకారం మనం ఒక్కసారి చూసినట్లయితే, రేవంత్ అందరికంటే ఎక్కువ ఓటింగ్ ని సంపాదించాడు. టాప్ వన్ పొజీషన్ లో ఉన్నాడు. సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఈవారం రేవంత్ తర్వాత ఇనయా కూడా సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. రేవంత్ కి గట్టి పోటీ ఇస్తోంది ఇనయా.

ఆ తర్వాత రోహిత్ కూడా తన ఓటింగ్ ని మెరుగుపర్చుకుంటూ మూడోస్థానంలో ఉన్నాడు. ఇక మిగిలింది ముగ్గురే ముగ్గురు ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. అయితే, ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. నిజానికి ఆదిరెడ్డికి అఫీషియల్ ఓటింగ్ బాగా జరుగుతోందని సోషల్ మీడియాలో టాక్ ఒకటి వచ్చింది. కానీ, ప్రస్తుతం అన్ అఫీషియల్ పోలింగ్స్ లో మాత్రం వెనకబడిపోయాడు. దీంతో కీర్తి సేఫ్ జోన్ లో కనిపిస్తోంది. ఇక్కడ కీర్తి ఈవారం సేఫ్ అయితే మాత్రం ఆదిరెడ్డి లేదా శ్రీసత్య ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

అయితే, ఈసారి హౌస్ మేట్స్ నిర్ణయాన్ని కూడా తీస్కుని బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా అనిపిస్తోంది. ఒక్కొక్కరిని సేఫ్ చేస్తూ లాస్ట్ లో మిగిలిన వాళ్లలో ఒకరిని ఫైనల్ కి తీస్కుని వెళ్లమని ఒకరిని సేఫ్ చేయమని బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టే ఛాన్స్ ఉంది. ఈవారం అందుకోసం కసరత్తులు జరుగుతున్నాయి.ఇక మరోవైపు ఆదిరెడ్డి ఫాలోవర్స్, ఇంకా కీర్తి ఫ్యాన్స్ తమ కంటెస్టెంట్ ని కాపాడటం కోసం ఓట్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో కాంపైన్స్ చేస్తున్నారు. ప్రతి చోటా ఓట్ వేయమని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి అదీ మేటర్.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus