This Weekend Releases: ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు/వెబ్ సిరీస్ ల లిస్ట్..!

ఎప్పుడూ కలిసొచ్చే జూలై నెల ఈసారి టాలీవుడ్ కు పెద్దగా కలిసి రాలేదు. అయితే ఆగస్టు 5న రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. బాక్సాఫీస్ దాహాన్ని తీర్చిన ఆ సినిమాలు ఈ వీకెండ్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ వారం కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. థియేటర్లలోనే కాకుండా ఓటీటీల్లో కూడా మంచి మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) లాల్ సింగ్ చడ్డా : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రం ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్లోనే కాదు తెలుగులో కూడా ఈ మూవీ పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతుంది. నాగ చైతన్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించడంతో ఈ సినిమా పై మంచి క్రేజ్ ఏర్పడింది. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

2) మాచర్ల నియోజకవర్గం : నితిన్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎడిటర్ ఎస్ ఆర్ శేఖర్ (ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి) దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ చెబుతుంది. ఆగస్టు 12న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

3) కార్తికేయ 2 : నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ ఆగస్టు 13… న విడుదల కాబోతోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్, ట్రైలర్లు చూస్తుంటే ‘కార్తికేయ 2’ ని మించి ఈ చిత్రంలో ట్విస్ట్ లు ఉన్నట్టు స్పష్టమవుతుంది. చూడాలి మరి..!

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/వెబ్ సిరీస్ లు :

4) హలో వరల్డ్ : ‘జీ5’ వారితో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 12న ‘జీ 5’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆర్యన్ రాజేష్, సదా, మై విలేజ్ షో అనిల్, నిఖిల్ విజయేంద్ర సింహా, నిత్య శెట్టి వంటి వారు ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు.

5) ‘రాష్ట్ర కవచ్’ : ఈ హిందీ సినిమా ఆగస్టు 11న నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

6) ‘బ్యూటిఫుల్ బిల్లో’ : ఈ పంజాబీ సినిమా ఆగస్టు 11న నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

7) ‘విండో సీట్’ : ఈ కన్నడ సినిమా ఆగస్టు 11 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

8) ‘శ్రీమతి’ : ఈ పంజాబీ సినిమా ఆగస్టు 12 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

9) కడవర్ : అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు స్వయంగా నిర్మించిన సినిమా ‘కడవర్’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 12 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

10) హ్యాపీ బ‌ర్త్‌డే : లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో…తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 8 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) ది వారియర్ : రామ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 11 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

12) థాంక్యూ : నాగ చైతన్య, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ మూవీ ఆగస్టు 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

13) గార్గి : సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 12 నుండి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

14) మహా మనిషి : విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం ఆగస్టు 12 నుండి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

15) మాలిక్ : ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ మూవీ ఆగస్టు 12 నుండి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

16) మలయన్‌కుంజ్ : ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ మలయాళ సినిమా కూడా ఆగస్టు 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది

17) నరూటో: షిప్పుడెన్‌ : ఈ వెబ్‌సిరీస్‌ ఆగస్టు 8 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

18) ఐ జస్ట్‌ కిల్‌డ్‌ మై డాడ్‌ : ఆగస్టు 9 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

19) ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌ సీజన్‌ 2 : ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

20) లాకీ అండ్‌ కీ సీజన్‌ 3 : ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus