జోరు వర్షాల మధ్య తమ అదృష్టం పరీక్షించుకోవడానికి ఈ వారం కొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి. రామ్, సాయిపల్లవి, సాయిపల్లవి.. ఇలా స్టార్ నటులు ఈ వారం బాక్సాఫీసు బరిలో ఉన్నారు. ఏ సినిమాకా సినిమా సరికొత్త కాన్సెప్ట్‌లు, జోనర్‌లలో వస్తున్నాయి. అవేంటి, ఎప్పుడు వస్తున్నాయి అనేది ఓ లుక్కేయండి మరి.
* రామ్ – లింగుస్వామి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్’. ఈ వారం విడుదలవుతున్న చిత్రాల్లో భారీ సినిమా ఇదే అని చెప్పొచ్చు. రామ్ తొలిసారి పోలీసుగా కనిపించబోతున్నాడు. అతని సరసన ఆర్జేగా కృతి శెట్టి కనిపించబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇప్పటికే అదిరిపోయిన స్పందన అందుకుంటోంది. మరి సినిమా ఫలితం తేలాలంటే జులై 14 వరకు వేచి చూడాలి.
* సాయి పల్లవిని డిఫరెంట్ లుక్‌లో ప్రజెంట్ చేస్తున్న చిత్రం ‘గార్గి’. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. పోలీసుల చెర నుండి తండ్రిని విడిపించడానికి ఓ కూతురు చేసే న్యాయ పోరాటమే ఈ సినిమా. సాయిపల్లవి నుండి ఇటీవల ‘విరాటపర్వం’లో అద్భుతమైన నటన చూశాం. ఇప్పుడు ఈ సినిమాలో అంతకుమించి అని అంటున్నారు. ఈ సినిమా 15న వస్తోంది.
* ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో ప్రభుదేవా ‘మై డియర్ భూతం’గా రాబోతున్నాడు. జూలై 15న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రభుదేవా గెటప్ అదిరిపోయింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
* ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘శభాష్ మిథూ’. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను 15న తీసుకొస్తున్నారు.
* విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమాను హిందీలో రాజ్ కుమార్ రావు అదే పేరుతో చేసిన విషయం తెలిసిందే. మాతృకను రూపొందించిన శైలేష్ కొలనునే ఈ సినిమాకూ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు శుక్రవారమే వస్తోంది.
* ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘అమ్మాయి : డ్రాగన్ గాళ్’ చాలా రోజుల నుండి విడుదల విడుదల అంటూ ఊరిస్తోంది. ఎట్టకేలకు జూలై 15నే తీసుకొస్తాం అంటున్నారు. హిందీలో ఈ సినిమా ‘లడకీ’ పేరుతో విడుద చేస్తున్నారు. దీంతోపాటు చైనా భాషలోనూ విడుదల చేస్తాం అంటున్నారు. అలాగే కన్నడ, తమిళ, మలయాళంలో వస్తుందట.
ఇక ఓటీటీ సంగతి చూస్తే…
* కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి ‘సమ్మతమే’ ఆహాలో జూలై 15న విడుదల చేస్తున్నారు. థియేటర్లలో సరైన స్పందన రాని ఈ సినిమా ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి.
* యువ హీరో సుశాంత్ ‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి వస్తున్నాడు. ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా చేసిన ఈ సిరీస్ 15 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘వరుడు కావలెను’ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఈ సిరీస్కు డైరక్షన్ చేస్తున్నారు.
* కీర్తీ సురేష్ మలయాళంలో చేసిన ‘వాషి’ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఆ సినిమాకు కీర్తి తండ్రి సురేశ్ నిర్మాత. టొవినో థామస్ హీరో. మలయాళ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో జూలై 17న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తున్నారు.
* డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూలై 15 నుంచి రెజీనా ‘శూర్‌వీర్’ హిందీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. జూలై 14న ‘కుంగ్ ఫు పాండా: ది డ్రాగన్ నైట్’ వెబ్ సిరీస్ను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. జూలై 14న హిందీ సినిమా ‘జాదూగర్’ను కూడా చూడొచ్చు. నుష్రత్ బరూచా నటించిన హిందీ సినిమా ‘జన్‌హిత్ మేరీ జాన్’ని జీ 5లో జూలై 15న విడుదల చేస్తున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!