This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు!

కరోనా కారణంగా రిలీజ్ కు పెండింగ్లో ఉన్న పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అయిపోయాయి.ఇక నుండి మీడియం రేంజ్, చిన్న.. సినిమాలదే హవా అంతా..! అలాగే డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలవుతూనే ఉన్నాయి. గత వారం విడుదలైన ‘మేజర్’ ‘విక్రమ్’ చిత్రాలు సూపర్ హిట్ టాక్ ను సంపాదించుని.. మంచి వసూళ్లను రాబడుతున్నాయి.వాటి హవా ఇంకా తగ్గకుండానే ఈ వారం నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘777 చార్లీ’ అనే డబ్బింగ్ సినిమా.. అలాగే పలు చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

అలాగే ఓటీటీలో కూడా థియేటర్ కు పోటీగా అన్నట్టు సినిమాలు/వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి.కాబట్టి.. థియేటర్ తో పాటు ఓటీటీలో కూడా ఈ వారం సందడి ఎక్కువే అని చెప్పాలి. మరి ఆలస్యం చేయకుండా ఈ వారం థియేటర్ ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లో విడుదల కాబోతున్న సినిమాలు :

1) అంటే సుందరానికీ! :

నాని, నజ్రియా హీరో హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న విడుదల కాబోతుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళంలో ‘ఆదదే సుందర’గా, మలయాళంలో ‘ఆహా సుందర’గా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు సముద్రాలు దాటి అమెరికా వెళ్లి అక్కడ ఓ క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమిస్తే.. కుటుంబంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.

2) 777 చార్లీ :

నేషనల్ క్రష్ రష్మిక మాజీ ప్రియుడు, కన్నడ స్టార్ హీరోలలో ఒకడైన రక్షిత్ శెట్టి… ‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తెలుగులో ఆ చిత్రం బాగానే ఆడింది.అతని లేటెస్ట్ మూవీ ‘777 చార్లీ’ పేరుతో జూన్ 10న థియేటర్లలో విడుదలవుతోంది. కన్నడ, తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.

3) సురాపానం :

సంపత్ కుమార్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ‘సురాపానం’.. ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. జూన్ 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

4) జరిగిన కథ :

క్రైమ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం జూన్ 10న విడుదల కాబోతుంది.

5) డియర్ ఫ్రెండ్ :

ఈ మలయాళం మూవీ జూన్ 10న విడుదల కాబోతుంది.

6) జ‌న్‌హిత్ మే జారి :

ఈ హిందీ సినిమా జూన్ 10న విడుదల కాబోతుంది.

ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు :

7) డాన్ :

శివ కార్తికేయన్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీ మే 13న థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.తెలుగులో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక థియేట్రికల్ రన్ కంప్లీట్ అవ్వడంతో జూన్ 10 నుండీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

8) కిన్నెరసాని :

మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణ తేజ దర్శకత్వం వహించాడు.సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. జూన్ 10న ఈ మూవీ నేరుగా ‘జీ 5’ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

9) సీబీఐ 5: ది బ్రెయిన్ :

ఈ మలయాళం యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో జూన్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతుంది.

10) మిస్ మార్వెల్ :

జూన్ 8న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో విడుదల కాబోతుంది.

11) ది బ్రికెన్ న్యూస్ :

ఈ వెబ్ సిరీస్ జీ 5 ఓటీటీలో జూన్ 10 నుండీ స్ట్రీమింగ్ కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus