వరుణ్ ధావన్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భేదియా’.అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకుడు. జియో స్టూడియోస్ & దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హారర్-కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ‘తోడేలు’ పేరుతో నవంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ సంస్థ నిర్మించింది. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడం అలాగే ‘కాంతార’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ కావడంతో ఈ సినిమా పై జనాల ఫోకస్ పడింది.
మొదటి రోజు ఈ మూవీకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం దారుణంగా నమోదయ్యాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
0.24 cr
సీడెడ్
0.16 cr
ఆంధ్ర
0.18 cr
ఏపీ +తెలంగాణ
0.58 cr
‘తోడేలు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రన్లో ఈ మూవీ కేవలం రూ.0.58 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. టోటల్ గా రూ.1.67 కోట్లు నష్టాలను మిగిల్చింది. తెలుగులో ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. తెలుగులో మరో ‘కాంతార’ అవుతుంది అని ఆశపడిన బయ్యర్స్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది ఈ మూవీ.