మెగా హీరోలలో వరుణ్ తేజ్ రూటే వేరు. విభిన్నమైన కథల్లో కనిపించడానికి ఉత్సాహం చూపించే మెగా ప్రిన్స్ ‘ఫిదా’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన “తొలిప్రేమ” ఫిబ్రవరి 10న మనదేశంలో విడుదలకానుంది. అయితే ఇప్పటికే ఈ మూవీ యుఎస్‌లో ప్రీమియర్ షోల రూపంలో రిలీజ్ అయింది. చూసిన వారి టాక్ ప్రకారం..
కథ..
రైలు ప్రయాణంలో వర్ష (రాశీ ఖన్నా) అనే అమ్మాయిని చూసి ఆది (వరుణ్ తేజ్ ) ప్రేమిస్తాడు. తర్వాత వీరిద్దరూ ఇంజినీరింగ్ కాలేజీలో కలుస్తారు. ఒకరికొకరు ప్రేమించుకుంటారు. వర్ష అన్నింటిని పట్టించుకుంటుంది. ఆది కోపం ఆమెకి నచ్చదు. ఇలా ఇద్దరు అభిరుచుల మధ్య తేడా రావడం, మిగిలిన కొన్ని కారణాల వల్ల దూరం అవుతారు. మళ్ళీ ఎలా ఒకటవుతారన్నది కథ.
నటీనటుల పనితీరు..
వరుణ్ తేజ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. మూడు దశల్లో తాను ఎలా ఉంటాడో లుక్ పరంగా, నటన పరంగా చూపించాడు. ముఖ్యంగా ఎమోషన్ సీన్లలో వరుణ్ నటన అదుర్స్. ఇప్పటివరకు గ్లామర్ డాల్ గా కనిపించిన రాశీఖన్నాకి వర్ష రూపంలో మంచి రోల్ దొరికింది. కాలేజీ రోజుల్లో అల్లరిగా కనిపించడం.. వారు పెరిగిన తర్వాత నిలకడగా ఆలోచించడం వంటి సన్నివేశాల్లో చక్కగా నటించింది. ప్రియదర్శి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. హైపర్ అది పంచ్ లతో అలరించాడు. విద్యుల్లేఖ రామన్ అయితే కాలేజీలో అక్క క్యారెక్టర్లో తెగ నవ్వించింది. సీనియర్ నటీనటులు సుహాసిని, నరేష్ లు తమ పాత్రలకి న్యాయం చేశారు.
విశ్లేషణ
తొలి ప్రేమ బ్రేకప్ అయి.. మళ్ళీ యూకేలో కలిసే ఓ యూత్ ఫుల్ స్టోరీని వెంకీ అట్లూరి అందంగా చూపించారు. ఫస్టాఫ్ మొత్తం సరదాగా సాగిన కథలో విశ్రాంతి ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్ మనసుకు హత్తుకుంటాయి. సెకండాఫ్ లో ఆది, వర్షల మధ్య రొమాంటిక్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి. నేటి యువతని ఆకట్టుకోవడంలో టీమ్ విజయవంతమైంది.
ఇది ఓవర్సీస్ లో సినిమా చూసిన వారి టాక్ మాత్రమే. ఫిల్మీ ఫోకస్ పూర్తి రివ్యూ కొన్ని గంటల్లో పబ్లిష్ కానుంది.