Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’.. ఆ సీన్స్ ఎందుకు డిలీట్ చేశారంటే?

‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా ఇటీవల అంటే ఫిబ్రవరి 2న విడుదల అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది ఈ మూవీ. దీంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. సుహాస్ ఈ మూవీతో హ్యాట్రిక్ సక్సెస్..లు అందుకున్నాడు. అయితే సుహాస్ కంటే ఈ సినిమాకి మెయిన్ హైలెట్ గా శరణ్య ప్రదీప్ నిలిచింది అని చెప్పాలి.

ఎక్కువ మంది ఆమె పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారు. గతంలో శరణ్య చిన్న చిన్న పాత్రల్లోనే కనిపించేది. ఆమె పాత్రలు 2 నిమిషాలకు మించి ఉండవు . ఓ రకంగా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా శరణ్య కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ లో శరణ్య ఓ బోల్డ్ సీన్లో నటించాల్సి వచ్చింది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్లో ఆమెను విలన్ బట్టలు విప్పేసి ఘోరంగా వేధిస్తాడు.

ఆ సన్నివేశంలో శరణ్య చాలా డేరింగ్ గా నటించింది అని చెప్పాలి. ఆమె ప్లేస్ లో ఇంకో నటి నటిస్తే ప్రేక్షకులు ఎమోషనల్ కనెక్ట్ అయ్యే వారు కాదేమో. శరణ్య కాబట్టి ఆ సీన్ కి వల్గారిటీ కూడా యాడ్ అవ్వలేదు. అయితే ఆ సన్నివేశంలో కొన్ని విజువల్స్ (Ambajipeta Marriage Band) చిత్ర బృందం డిలీట్ చేయడం జరిగిందట.

ముందుగా అనుకున్న సీన్ ప్రకారం అయితే ఆమె బట్టలు లేకుండా నడుచుకుంటూ వచ్చే విజువల్ ఉంటుందట. అంత బోల్డ్ గా శరణ్య నటించిందట. కానీ తర్వాత ఆ సీన్ ని కట్ చేశారు అని తెలుస్తుంది. అంతేకాదు శరణ్య… ‘పుష్ప’ ఫేమ్ కేశవని కలుసుకుని ప్రపోజ్ చేసే సీన్ కూడా ఉంటుందట. అది కూడా డిలీట్ చేసినట్లు ఇన్సైడ్ టాక్.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus