Jr NTR: ఎన్టీఆర్‌ బర్త్‌డే స్పెషల్‌ మామూలుగా ఉండదట!

జూనియర్‌ నందమూరి తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా ఈ ఏడాది అభిమానులకు పెద్దగా సర్‌ప్రైజ్‌లు ఉండవు అని ఇటీవల మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఆయన దర్శకనిర్మాతల ఆలోచనలు మారాయని తెలుస్తోంది. హీరో పుట్టినరోజు నాడు ఏదైనా స్పెషల్‌ ఉండాలి కదా అని అభిమానులు సోషల్‌ మీడియాలో అడుగుతుండటమో, లేక ఇంకే కారణమో కానీ అప్‌డేట్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ముందుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి మాత్రమే అప్‌డేట్‌ వస్తుంది అనుకుంటుండగా… ఇప్పుడు మొత్తంగా మూడు వస్తాయని అంటున్నారు.

ఎన్టీఆర్‌ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు చూస్తే… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణ జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవల ప్రకటించారు. ఇది కాకుండా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా ఓ సినిమా చేయబోతోందనే విషయం తెలిసిందే. ఇటీవల ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలే ప్రకటించారు. కాబట్టి మొత్తంగా ఎన్టీఆర్‌… మూడు సినిమాలు చేస్తున్నట్లు. ఇప్పుడు పుట్టిన రోజునాడు ఈ మూడు సినిమాల అప్‌డేట్సే ఉంటాయట.

కొరటాల శివ సినిమాకు సంబంధించి కేవలం ప్రకటన మాత్రమే వచ్చింది. సినిమా కాన్సెప్ట్‌ పోస్టరేనా విడుదల చేస్తారేమో అని అభిమానులు అనుకున్నారు. అయితే అప్పుడు వీలవలేదు. కానీ పుట్టిన రోజు నాడు కాన్సెప్ట్‌ పోస్టర్‌ వస్తుందని టాక్‌. ప్రశాంత్‌ నీల్‌ సినిమా విషయంలోనూ అదే జరుగుతుందని టాక్‌. అయితే ఇందులో కాన్సెప్ట్‌ చెప్పకుండా.. ఇద్దరూ కలసి సినిమా చేస్తారని మాత్రం చెబుతారట. అయితే రాబోయే రోజుల్లో వీటి మీద పూర్తి క్లారిటీ వచ్చేలా ఉంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus