NBK109: బాలయ్య 109వ సినిమాకి దర్శకుడు ఎవరంటే..

నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య నటిస్తున్న 108వ మూవీ ఇది. ఈ నెల మూడో వారం నుండి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవనుంది. కథానాయికగా కాజల్ అగర్వాల్ దాదాపు ఫిక్స్ అయినట్టేనని సమాచారం.. సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు, సేవా కార్యక్రమాలు, టాక్ షో.. ఇలా ఫుల్ బిజీగా ఉంటున్న బాలయ్య..

గతకొద్ది రోజులుగా పనులన్నీ పక్కన పెట్టి.. అన్నయ్య నందమూరి మోహన కృష్ణ కొడుకు తారక రత్న చికిత్స పొందుతున్న బెంగుళూరులోని ఆసుపత్రి దగ్గరే ఉంటున్నారు. కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తున్నారు. అన్నకొడుకు కోలుకోవాలంటూ ఆయన పడే ఆరాటం, పొందుతున్న ఆవేదన అభిమానులను కలచి వేసింది.. ఇదిలా ఉంటే.. బాలయ్య 109వ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

‘పైసా వసూల్’ లో బాలయ్యని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకుడు అని అంటున్నారు. ‘పైసా వసూల్’ తర్వాత మరో సినిమా చేస్తామని అన్నారు. ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయిపోయారు. ఇప్పటికి వీలు పడిందని సమాచారం.. బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ కాంబో.. బాలయ్య – బోయపాటి.. ‘అఖండ’ సీక్వెల్ కోసమా?.. లేక కొత్త కథా? అనేది తెలియదు కానీ 14 రీల్స్ బ్యానర్లో ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుంది అంటున్నారు.

‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ ను మించి.. మరో కొత్త చరిత్ర సృష్టించబోయేలా ఉండబోతుందనీ న్యూస్ వైరల్ అవుతుంది.. కట్ చేస్తే.. మరికొద్ది రోజుల్లో NBK 109 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.. ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా.. ఎవరూ ఊహించని డైరెక్టర్ పేరు రివీల్ చెయ్యబోతున్నారంటూ నెట్టింట పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus