Prabhas, Maruthi: అలాంటి కథతో ప్రభాస్ మారుతి మూవీ తెరకెక్కుతోందా?

స్టార్ హీరో ప్రభాస్ కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రభాస్ సినిమా విడుదలైతే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని కొన్ని రోజుల క్రితం జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. తక్కువ బడ్జెట్ తో మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఒక ప్రయోగాత్మక సినిమాలో నటించనున్నారని సమాచారం.

Click Here To Watch

ప్రభాస్ మారుతి కాంబో మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారని సెట్ లోనే ఈ సినిమాకు సంబంధించిన సగం షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. కేవలం 90 రోజుల్లోనే షూటింగ్ పూర్తయ్యే విధంగా ఈ సినిమా విషయంలో ఒప్పందం జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా. మారుతి ప్రభాస్ కు ఈ సినిమాకు సంబంధించి లైన్ చెప్పారని ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం హీరోయిన్ల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతోందని మే లేదా జూన్ నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మారుతి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. థ్రిల్లర్ అయినప్పటికీ ఈ సినిమాలో దెయ్యం తరహా కాన్సెప్ట్ అయితే ఉండదని సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది.

మారుతి ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. పక్కా కమర్షియల్ సినిమాతో మారుతి మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus