Saindhav: వెంకీ 75వ సినిమాపై ఆసక్తికర రూమర్‌.. నిజమైతే విందే!

ఒక హీరోయిన్‌ ఉంటేనే వెండితెరపై వయ్యారాలు, అందాలు అదిరిపోతున్న రోజులివి. అదే ముగ్గురు హీరోయిన్లు ఉంటే ఇక వడ్డన అడ్డు లేదనే చెప్పాలి. అలాంటి అందాల విందుకు రెడీ అవ్వండి అంటున్నాడు ‘సైంధవ్‌’. అవును మీరు అనుకుంటుంది కరెక్ట్‌ వెంకటశ్‌ కొత్త సినిమా.. మైలు రాయి 75వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్‌ నడుస్తోంది. ఇటీవల ముహూర్తం జరుపుకున్న ఈ సినిమా గురించి ముగ్గురు హీరోయిన్ల పుకారు తాజాగా షికార్లు చేస్తోంది.

వెంకటేష్‌ తొలి పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘సైంధవ్‌’ను శైలేష్‌ కొలను దర్శకుడు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ త్వరలో మొదలుకానున్న నేపథ్యంలో కథానాయికల ఎంపికపై దృష్టి పెట్టారట. పాన్‌ ఇండియా సినిమా కావడంతో ఓ నాయికను బాలీవుడ్‌ నుండి, మరో ఇద్దరు ముద్దుగుమ్మల్ని దక్షిణాది నుండి తీసుకోవాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.ఇక చాలా సినిమాలు చెప్పినట్లే ముగ్గురు హీరోయిన్లకూ కథలో ప్రాధాన్యముంటుందని చెబుతున్నారు.

అయితే ఒక కమర్షియల్‌ సినిమాలో హీరోయిన్‌కి ప్రాధాన్యం అందులోనూ ముగ్గురు హీరోయిన్లకూ ప్రాధాన్యం అంటుండటంతోనే డౌట్‌ అనిపిస్తోంది. అలాగే ఆ హీరోయిన్లు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఏ హీరోయిన్‌ కూడా వెంకటేశ్‌కు జోడీగా కనిపించదని చెబుతున్నారు. ఇదంతా వింటుంటే సినిమాలో అమ్మాయిల నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందని అర్థమవుతుంది. ఇక రీసెంట్‌ టైమ్స్‌లో మన సీనియర్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోకు తోడుగా మరో హీరో ఉంటూ వస్తున్నాడు. తాజాగా ‘సైంధవ్‌’ ఓ కీలక పాత్ర ఉందని, అది సినిమా కీలక సమయంలో వస్తుందని సమాచారం.

దీని కోసం ఎవరు బాగుంటారా అని చూస్తే.. తమిళ హీరో ఆర్య పేరు అనిపించిందని చెబుతున్నారు. ఆ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని కూడా చెబుతున్నారు. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌ తొలి వారం నుండి ఈ సినిమా రెగ్యులర్‌ ప్రారంభమవుతుందని సమాచారం. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా సౌత్‌ లాంగ్వేజ్‌తోపాటు హిందీలోనూ విడుదల చేస్తారు. కథ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేకపోయినా.. పేరు, పోస్టర్‌, లుక్‌ చూస్తే మాత్రం వెంకీ కెరీర్‌లో ఇదొక స్పెషల్‌ ఫిల్మ్‌గా నిలిచిపోతుందని అంచనా వేస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus