ఈ వారం గెలుపెవరిదో..?

  • March 17, 2021 / 03:48 PM IST

గత వారం మహాశివరాత్రి సందర్భంగా ఒకేసారి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘జాతి రత్నాలు’ సినిమా మంచి సక్సెస్ ను అందుకొని.. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ వారం బాక్సాఫీస్ వద్ద మరో మూడు సినిమాలు తలపడనున్నాయి. ‘చావు కబురు చల్లగా’, ‘మోసగాళ్ళు’, ‘శశి’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ మూడు చిత్రాలలో ‘చావు కబురు చల్లగా’ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు.

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. పెళ్లై భర్త చనిపోయిన అమ్మాయిని.. హీరో ప్రేమిస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మిగిలిన సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో పాటు మంచి విష్ణు నటించిన ‘మోసగాళ్ళు’ రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం మంచు విష్ణు మార్కెట్ కి మించు ఖర్చు చేశారు. సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.

కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ఉండడం సినిమాకి మరో ప్లస్ పాయింట్. ఈ రెండు సినిమాలతో పాటు ఆది సాయికుమార్ నటించిన ‘శశి’ సినిమా కూడా విడుదలవుతోంది. చాలా కాలంగా హిట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు ఆది సాయికుమార్. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. ఈ సినిమా నుండి విడుదలైన ‘ఒకే ఒక లోకం నువ్వే’ అనే పాట కూడా సూపర్ హిట్ అయింది. మొత్తానికి ఈ వారంలో ఈ మూడు సినిమాలు థియేటర్లో సందడి చేయనున్నాయి. మరి వీటిలో ఏది సక్సెస్ అందుకుంటుందో చూడాలి!

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus