Balakrishna, Boyapati Srinu: బాలయ్య – బోయపాటి కొత్త సినిమా ఏది?

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీనివాస్‌ ‘అఖండ’తో హ్యాట్రిక్‌ కొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో విజయోత్సవంలో చిత్రబృందం ఉండగా… తర్వాతి సినిమా ఎలా ఉండొచ్చు అనే అంచనాల్లో అభిమానులు ఉన్నారు. ఏ సినిమా చేస్తారు, బాలయ్య పాత్ర ఎలా ఉంటుంది వంటి ప్రశ్నలు, చర్చలు నడుస్తున్నాయి. అయితే వీటన్నింటిని డబుల్‌ చేసేలా కీలక వ్యాఖ్యలు చేశారు బోయపాటి శ్రీనివాస్‌. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.

బాలయ్య హోస్ట్‌గా ఆహాలో ‘అన్‌స్టాపబుల్‌’ అనే షో వస్తున్న విసయం తెలిసిందే. అందులో ‘అఖండ’ టీమ్‌ ఇటీవల సందడి చేసింది. ఈ క్రమంలో బాలయ్యతో మరి ‘అఖండ’ సీక్వెల్‌ ఆశించొచ్చా అనే ప్రశ్న బోయపాటికి ఎదురైంది. ఈ ప్రశ్న చాలామంది మదిలో మెదులుతోంది కూడా. దీనికి బోయపాటి అదిరిపోయే సమాధానం ఇచ్చారు. బాలయ్య ఊ అంటే… సీక్వెల్‌ చేయడానికి మూడు సినిమాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటివరకు ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలయ్య ఓకే అంటే ‘సింహా 2’, ‘లెజెండ్‌ 2’, ‘అఖండ 2’ తీయడానికి నేను రెడీ అని చెప్పేశారు బోయపాటి. అంటే తర్వాత వచ్చే సినిమా దేనికి సీక్వెల్‌ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. లేదంటే ఈ మూడూ కాదని కొత్త సినిమా చేస్తారా అనేది చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus