Prabhas: ‘స్పిరిట్’ ను ఆ ముగ్గురు రిజెక్ట్ చేస్తే ప్రభాస్ వద్దకు వెళ్ళిందట..!

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలుగులో తన రెండో చిత్రాన్ని అనౌన్స్ చేయడానికి చాలా టైమే పట్టింది. ఎట్టకేలకు ప్రభాస్ 25 ని అతనే డైరెక్ట్ చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించాడు. ‘స్పిరిట్’ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు ఈ మధ్యనే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రభాస్ కెరీర్ లో మైలురాయి చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం సందీప్… రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

అది పూర్తయ్యాకే ప్రభాస్ సినిమా ఉంటుంది.ఇదిలా ఉండగా.. ‘స్పిరిట్’ కథని ప్రభాస్ కంటే ముందుగా ముగ్గురు స్టార్ హీరోలకి వినిపించాడట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. మొదట ఈ చిత్రాన్ని చరణ్ కు వినిపించాడట. చరణ్ కు ఈ కథ నచ్చినప్పటికీ.. అతని కాల్ షీట్లు ఖాళీ లేకపోవడంతో మహేష్ ను రిఫర్ చేసాడట. మహేష్ కు కూడా ఈ కథ నచ్చింది.దాంతో ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని సందీప్ కు చెప్పాడట. కానీ స్క్రిప్ట్ పరంగా మహేష్ సంతృప్తి చెందలేదు. దాంతో సందీప్…

మళ్ళీ అల్లు అర్జున్ కు వినిపించాడు. అతను కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. మధ్యలో యూవీ క్రియేషన్స్ వారికి కూడా సందీప్ ఈ కథని వినిపించాడు. వాళ్ళు ఆ కథని ప్రభాస్ వరకు తీసుకెళ్ళడం, ప్రభాస్.. సందీప్ కు ఫోన్ చేసి పిలవడం.. ఫుల్ స్క్రిప్ట్ విని ఓకే చేయడం జరిగిపోయాయని తెలుస్తుంది. ఇద్దరూ కూడా టి.సిరీస్ వారికి ఓ సినిమా చేయాలనే అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు సెట్ చేసేసుకున్నారు. కాస్త లేటైనా సందీప్ కు ఏకంగా పాన్ ఇండియా స్టార్ దొరికేసాడని చెప్పొచ్చు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus