సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని మే 1 న ఆంధ్రప్రదేశ్ లో కొన్ని థియేటర్లలో విడుదల చేసాడు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సినిమా విడుదల చేయడానికి ఈసీ ఒప్పుకోలేదు. అయినా సినిమాని విడుదల చేసాడు వర్మ. మొత్తానికి తన పంతం నెగ్గించుకున్నాడు. అయితే నిషేదం ఉన్న సినిమాని అడ్డుకోలేకపోయారని కడప జాయింట్ కలెక్టర్ పై ఈసీ చర్యలు తీసుకోవడానికి కూడా రెడీ అయ్యిందట. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ రాజకీయ నేతల బయోపిక్ లు విడుదల చేయకూడదనే రూల్ ఉంది. కానీ వర్మ మాత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను ఏపీలో విడుదల చేస్తానని పట్టుబట్టి మరీ చేసాడు.
ఇందుకోసం ఈసీ కి లెటర్ రాసినా ఈసీ ఒప్పుకోలేదు. వర్మ విడుదల చేస్తానని ఫిక్సయినా చాలా థియేటర్ యాజమాన్యాలు వెనుకడుగు వేసాయి. కానీ కడప పోరుమామిళ్లలోని వైసీపీ నేతలకు చెందిన రెండు థియేటర్లలో మాత్రం షోలను ప్రదర్శించారు. ఈ విషయం పై ఈసీ వరకూ వెళ్లడంతో.. నియమాలు ఉల్లంఘించి సినిమాను ప్రదర్శించినందుకు థియేటర్ల లైసెన్స్ ను క్యాన్సిల్ చేయాలని ఆదేశాలు పంపారు. ఇప్పడు ఈ విషయం పై తీవ్ర చర్యలు తీసుకోబోతుందట. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ప్రదర్శించాలని ఏ థియేటర్ యాజమాన్యం ప్రయత్నించినా… దీని పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ వార్నింగ్ ఇచ్చింది.