మహేష్ బాబుతో మళ్ళీ థ్రిల్లరే తీస్తానంటున్న సుకుమార్.!

“రంగస్థలం”తో దర్శకుడిగా తన స్టార్ డమ్ ను తిరిగి సొంతం చేసుకొన్న సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం కోసం సుకుమార్ మంచి కథ రెడీ చేశాడట. ఇదివరకు మహేష్-సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన “ఒన్ నేనొక్కడినే” డిజాస్టర్ అయ్యిందన్న విషయం తెలిసిందే. సస్పెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికీ మహేష్ బాబు కెరీర్ లో “ఒన్నాఫ్ ది బెస్ట్ ఫిలిమ్” అని అందరూ చెబుతున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆ సినిమా బొక్కబోర్లా పడింది.

అప్పట్నుంచి మహేష్ మంచి హిట్ ఇవ్వాలని తపించే సుకుమార్.. మహేష్ మరో అవకాశం ఇవ్వడంతో “ఒన్ నేనొక్కడినే” తరహాలోనే ఒక థ్రిల్లర్ ప్లాన్ చేశాడట. ఈమేరకు స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని వినికిడి. మరి ఈ రెండో ప్రయత్నంలో సుకుమార్ ఏమేరకు విజయం సాధిస్తాడో చూడాలి. మహేష్ 25వ సినిమా పూర్తయిన అనంతరం సుకుమార్ సినిమా సెట్స్ కు వెళ్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus