Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

కమల్ హాసన్ (Kamal Haasan) -మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్లో 37 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన ‘థగ్ లైఫ్’ (Thug Life)సినిమా జూన్ 5న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ మొదటి రోజు ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ 2వ రోజు నుండి డౌన్ అయిపోయింది. వీకెండ్ తర్వాత మినిమమ్ కలెక్షన్స్ ను కూడా రాబట్టలేకపోయింది ఈ సినిమా.

Thug Life Collections:

‘విక్రమ్’ కాదు కదా కనీసం ‘ఇండియన్ 2’ డే1 ఓపెనింగ్స్ లో సగం కూడా ఈ సినిమా రికవరీ చేయలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  0.81 cr
సీడెడ్ 0.27 cr
ఉత్తరాంధ్ర  0.29  cr
ఈస్ట్  0.11 cr
వెస్ట్  0.08  cr
గుంటూరు 0.16 cr
కృష్ణా 0.21 cr
నెల్లూరు 0.08cr
ఏపీ+తెలంగాణ టోటల్ 2.01  cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.21 cr
టోటల్ వరల్డ్ వైడ్ 2.22 cr (షేర్)

‘థగ్ లైఫ్’ (Thug Life) కి తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.12.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.2.22 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.56 కోట్లు అని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.10.28 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

చిక్కుల్లో పడ్డ మంగ్లీ.. అసలేం జరిగింది..!

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus