అవును సినీ లవర్స్ కు నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు తగ్గనున్నాయి. కరోనా వల్ల తెలుగు సినిమా పరిశ్రమ ఆర్ధికంగా చాలా నష్టపోయింది. అటు తర్వాత కూడా ఎన్నో సమస్యలు వెంటాడాయి.ముఖ్యంగా టికెట్ రేట్ల ఇష్యు.. తగ్గించడం ఒక సమస్య… పెంచడం మరొక సమస్య అన్నట్టు అయ్యింది.అంతేకాకుండా థియేటర్లలో షోలు తగ్గించడం అనేది కూడా పంపిణీదారులకి మరింత సమస్యగా మారింది! అయితే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని వెసులుబాటు ఇవ్వడంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పోసుకుంది.
అన్ని ఏరియాల్లోనూ ఆ చిత్రం రికార్డ్ వసూళ్లను రాబట్టడానికి ముఖ్యకారణం అదొక్కటిగా చెప్పుకోవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యి 10 రోజులు పూర్తయ్యింది.జనాల్లో ఆ మూవీ ఫీవర్ కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. ఇక ప్రతీవారం లానే ఈ వారం కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో వరుణ్ తేజ్ ‘గని’ మూవీ కూడా ఒకటి.ఈ మూవీ పై మంచి బజ్ ఉంది.ప్రోమోలు, ట్రైలర్లు, పాటలు వంటివి జనాల్ని అక్కట్టుకున్నాయి. ఈ చిత్రానికి వచ్చే ప్రేక్షకులను టికెట్ రేట్లు అనేవి భారం కాకుండా తగ్గించారు.
అవును తెలంగాణలో ‘గని’ టికెట్ రేట్స్ తగ్గించడం జరిగింది. ఈ చిత్రానికి మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో ₹200 + జీఎస్టీ, సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి ₹ 150 గా టికెట్ రేట్లు ఉంటాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇది పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.’గని’ చిత్రానికి కూడా ఇది హెల్ప్ అయ్యే అవకాశాలు ఉంటాయి.సమ్మర్ కాబట్టి.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి… బాక్సాఫీస్ వద్ద ‘గని’ మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
‘గని’ టీం కూడా ఈ విషయమై హర్షం వ్యక్తం చేస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ‘గని’ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకుడు. అల్లు బాబీ, సిద్దు ముద్దు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సయీ మంజ్రేకర్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమవుతుంది. ఏప్రిల్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.