గత నెల 25వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై అంచనాలను మించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లను పెంచడం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కలిసొచ్చింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమా సాధించని స్థాయిలో ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లను సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమాకు 532 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. గ్రాస్ కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమాకు 964 కోట్ల రూపాయలు వచ్చాయి.
ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ సాధించడంతో కేజీఎఫ్2 సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు ఏకంగా 110 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని బోగట్టా. అయితే కేజీఎఫ్2 సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ కు తగిన స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఈ సినిమాకు టికెట్ రేట్లను పెంచాలని కేజీఎఫ్2 నిర్మాతలు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నారని తెలుస్తోంది.
కేజీఎఫ్2 డబ్బింగ్ సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమా విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తాయో చూడాల్సి ఉంది. మరోవైపు టికెట్ రేట్లు పెంచితే ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. కుటుంబంతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన వాళ్లపై ఊహించని స్థాయిలో భారం పడింది. ఆర్ఆర్ఆర్ మూవీ ఎఫెక్ట్ కేజీఎఫ్2 సినిమాపై అన్ని విధాలుగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కేజీఎఫ్2 సినిమాకు ఆర్ఆర్ఆర్ సినిమాకు మించి బిజినెస్ జరిగింది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో సాధించిన కలెక్షన్లను కేజీఎఫ్2 మూవీ బ్రేక్ చేస్తుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. యశ్, ప్రశాంత్ నీల్ కెరీర్ కు కేజీఎఫ్2 సక్సెస్ ఎంతో కీలకమని చెప్పవచ్చు.
Most Recommended Video
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!