బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం టిక్కెట్ టు ఫినాలే కోసం హౌస్ మేట్స్ తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఐదు టాస్క్ లు కంప్లీట్ చేశాడు బిగ్ బాస్. ఇందులో ఫస్ట్ రెండు రౌండ్స్ లో బోటమ్ లో ఉన్న ఇద్దరు అంటే శివాజీ ఇంకా శోభా వెళ్లిపోతూ తమ పూర్తి పాయంట్స్ ని అమర్ కి ఇచ్చి వెళ్లారు. ఆ తర్వాత రెండు రౌండ్స్ పూర్తి అయిన తర్వాత ప్రియాంక వెళ్లిపోతూ తన పాయింట్స్ లో సగం పాయింట్స్ ని గౌతమ్ కి ఇచ్చింది. దీంతో గౌతమ్ కూడా రేస్ లోకి వచ్చాడు.
అమర్ , అర్జున్, ప్రశాంత్, గౌతమ్ ఇంకా యావర్ లు తర్వాత టాస్క్ లు ఆడేందుకు సిద్ధం అయ్యారు. ప్రస్తుతం లైవ్ లో చూస్తే ఆరో టాస్క్ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ టాస్క్ లో అమర్ దీప్ విజయం సాధించాడు. దీంతో అమర్ దీప్ ఫస్ట్ టైమ్ 100 పాయింట్స్ కొట్టాడు. ఆరు టాస్క్ లు కంప్లీట్ అయిన తర్వాత బోటమ్ లో ఉన్న యావర్ అవుట్ అయ్యాడు. దీంతో యావర్ తన పాయింట్స్ ని పల్లవి ప్రశాంత్ కి ట్రాన్సఫర్ చేశాడు.
నిజానికి అమర్ యావర్ ని తనకి ఇమ్మని అడిగాడు. కానీ, పల్లవి ప్రశాంత్ లీస్ట్ లో ఉన్నాడని తనకి అవసరమని చెప్పి యావర్ తన పాయింట్స్ ని పల్లవి ప్రశాంత్ కి ఇచ్చాడు. ఇక ఏడో టాస్క్ లో పల్లవి ప్రశాంత్ విన్ అవ్వగా, ఏనిమిదో టాస్క్ లో మరోసారి అమర్ దీప్ విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. ఎనిమిది టాస్క్ లు అయిన తర్వాత అర్జున్ బోటమ్ లో ఉన్నాడు. నిజానికి అర్జున్ మూడు టాస్క్ లలో గెలిచాడు. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా మూడు టాస్క్ లలో గెలిచాడు.
అమర్ దీప్ కేవలం రెండు టాస్క్ లలో మాత్రమే గెలిచి టేబుల్ టాప్ లో ఉన్నాడు. అర్జున్ అయితే తన పాయింట్స్ ని గౌతమ్ కి ఇస్తాడు. అలాగే గౌతమ్ లీస్ట్ లో ఉంటే అర్జున్ కి ఇస్తానని మాట ఇచ్చాడు. సో, ఇద్దరూ ఒకరికొకరు ఎక్స్సేంజ్ చేస్కుంటే , గౌతమ్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. బిగ్ బాస్ ఎనిమిది టాస్క్ లు తర్వాత టేబుల్ లో టాప్ లో ఉన్నవాళ్ల ఇద్దరికీ కలిసి ఒక టాస్క్ పెడతాడు.
వారిద్దరిలో ఎవరు గెలిస్తే వారికి టిక్కెట్ టు ఫినాలే (Bigg Boss 7 Telugu) అనేది దక్కుతుంది. ఈ టిక్కెట్ టు ఫినాలే గెలిచిన వాళ్లు నేరుగా టాప్ 5లోకి వెళ్లిపోతారు. అయితే, ఈవారం ఎవిక్షన్ నుంచీ వాళ్లు సేఫ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే టిక్కెట్ టు ఫినాలే వేస్ట్ అయినట్లే లెక్క. మరి ప్రస్తుతం అయితే అమర్ దీప్ టేబుల్ లో టాప్ ఉన్నాడు కాబట్టి ఫైనల్ రేస్ ఆడేందుకు ఒక పార్టిసిపెంట్ వచ్చినట్లే.