‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) హవా మొదలైంది. ఆ సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్న మొన్నటి వరకు ‘పుష్ప 2’ పై ఉన్న అనుమానాలు అన్నీ ఈ ట్రైలర్ తో పటా పంచలు అయిపోయాయి అని చెప్పాలి. ట్రైలర్లోని విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ‘పుష్ప’ (Pushpa) గా అల్లు అర్జున్ (Allu Arjun) మ్యానరిజమ్స్ అన్నీ అదిరిపోయాయి. అభిమానులు ‘పుష్ప 2’ ఎలా ఉండాలి అని అనుకుంటారో.. అన్ని అంశాలు ఇందులో ఉన్నట్టు స్పష్టమవుతుంది.
చైనా నేపథ్యంలో కూడా కొంత భాగం షూట్ చేసినట్లు తెలుస్తుంది. అందుకే ‘పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్’ అనే పవర్ఫుల్ డైలాగ్ పెట్టారు. యూట్యూబ్లో ఈ ట్రైలర్ 100 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టి ఇంకో రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 4న ప్రీమియర్ షో టికెట్ల కోసం ఇప్పటి నుండే ఎదురు చూసేలా చేసింది ‘పుష్ప 2’ ట్రైలర్. మరోపక్క ఓపెనింగ్ డే రికార్డుల కోసం ‘మైత్రి’ సంస్థ కొత్త కొత్త స్ట్రాటజీలు వేస్తూ ముందుకు సాగుతుంది.
ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ బెనిఫిట్ షోల కోసం వేలం పాట ఏర్పాటు చేస్తారట. సాధారణంగా ప్రీమియర్ షోల టికెట్ రేట్లు రూ.1000 వరకు ఉంటాయి. ఈ వేలం పాటలో ఆ టికెట్ ధర రూ.10000 వరకు పలికే అవకాశం ఉంది. ఇలా మొదటి రోజు ‘పుష్ప 2’ రికార్డు కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఓపెనింగ్ డే రికార్డ్ రూ.221 కోట్లు ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రం పేరుతో ఉంది. ‘పుష్ప 2’ తో ఆ రికార్డును బ్రేక్ చేయాలనేది ‘మైత్రి’ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది.